36.2 C
Hyderabad
April 25, 2024 22: 01 PM
Slider వరంగల్

దళిత గిరిజన భూముల్ని లాక్కుంటున్న ప్రభుత్వం

#MuluguSCs

దళిత గిరిజన వర్గాల ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు గత ప్రభుత్వాలు భూములు ఇస్తే ఈ తెలంగాణ ప్రభుత్వం లాక్కుంటోందని ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజల భిక్షపతి గౌడ్ అన్నారు.

ఎమ్మార్పీఎస్ రెండవ రోజు దీక్షలను ప్రారంభించిన అనంతరం భిక్షపతి గౌడ్ మాట్లాడారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిన కేసీఆర్ ఇప్పుడు అసైన్డ్ భూములను కూడా లాక్కుంటున్నారని అన్నారు.

రైతు వేదిక, ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక పేరుతో దళిత గిరిజనుల భూములు లాక్కోవడం దుర్మార్గపు చర్య అని  ముంజల  బిక్షపతి అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ భూ దందాలు అరికట్టాలని ఈరోజు దీక్షలో బిక్షపతి డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వాలు భూములు ఇస్తే ఈ ప్రభుత్వం  ఆక్రమించుకుంటుందని ప్రశ్నించారు. అసైన్డ్ భూములకు రక్షణ కల్పించాలని భూముల పరిరక్షణ కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు జన్ను రవి మాదిగ ఎమ్మార్పీఎస్ ములుగు జిల్లా నాయకులు మడిపల్లి శ్యామ్, బోడ రఘు, గజ్జల ప్రసాద్, వావిలాల స్వామి, జనార్ధన్, ఓరుగంటి అనిల్, బొచ్చు సమ్మయ్య, బిట్ల ఓరయ్య, తిరుపతి ఏటూర్ నాగారం తాడువాయి వెంకటాపురం గోవిందరావుపేట వాజేడు మండలాల్లో జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Related posts

సేవ్ నల్లమల్ల నినాదంతో కదం తొక్కుతున్న యువత

Satyam NEWS

పాత వస్తువుల బహిరంగ వేలం

Murali Krishna

వాజ్ పేయి జీవిత చరిత్ర పాఠ్యాంశంగా చేర్చాలి

Satyam NEWS

Leave a Comment