39.2 C
Hyderabad
April 25, 2024 15: 22 PM
Slider నల్గొండ

దళిత సంఘాల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా

#Chityala Police Station

కోర్టు వివాదం లో ఉన్న భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా పనులు చేస్తూ, దళితులు, మహిళలు,పిల్లలు అని చూడకుండా పోలీసులు స్టేషన్ కు తీసుకువెళ్ళడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కే.వి.పీ.యస్. జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున చెప్పారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం  చిట్యాల పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం రోజున కే.వీ.పీ.యస్.,యం. ఆర్. పీ.యస్, వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు.

చిట్యాల పట్టణ పరిధిలోని సర్వే నెంబరు 390 యందు జిట్ట బుచ్చయ్య, సత్తయ్య లకు 30గుంటలు, ముప్పా నర్సింహారెడ్డి కి 30 గుంటలు భూమి పట్టా కలిగి, బాగపంపకాల విషయంలో తగాదా పడి 2014 సంవ త్సరంలో కోర్టుకెళ్లారు. ఈ విషయం లో దళితులైన బుచ్చయ్య, వారి కుటుంబ సభ్యులపై అనేక అక్రమ కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

నరసింహ రెడ్డి, డిల్లీ లో పని చేసే ఆయన అల్లుడి పలుకుబడి ఉపయోగించి పేద కుటుంబాలకు చెందిన జిట్ట బుచ్చయ్య కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తూ, పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారంతో వివాదాస్పద భూమి లో అక్రమంగా మట్టి పోస్తూ, అనుమతులు లేకుండా పనులు చేయడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు జిట్ట నగేష్, పోకల దేవదాసు, జిట్ట బొందయ్య, యం. ఆర్. పీ.యస్  జిల్లా నాయకులు మేడి శంకర్, జిట్ట వెంకన్న, శేఖర్, రమేష్, పార్వతమ్మ, యాదమ్మ, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొల్లాపూర్ ప్రాంతంలో కరోనా బియ్యం దొంగలు

Satyam NEWS

గులకరాయి డ్రామాలో టీడీపీ నేతల్ని ఇరికిస్తే ఊరుకోం

Satyam NEWS

ఏప్రిల్‌లో విశేష ప‌ర్వ‌దినాలు

Sub Editor 2

Leave a Comment