29.7 C
Hyderabad
April 18, 2024 05: 47 AM
Slider శ్రీకాకుళం

పలాస పోలీస్ స్టేషన్ ఎదుట దళితుడిపై దాడి

#DharmanaKrishnadas

శ్రీకాకుళం జిల్లాలో దళితునిపై  దాడి ఘటన దురదృష్టకరమని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస పోలీస్ స్టేషన్ ఎదుట దళితునిపై సి ఐ దాడికి దిగడం బాధాకరమని ఆయన తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.

బాధ్యులైన సి ఐ ని వేణుగోపాల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని తగిన ఆదేశాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నామని, దళితుల రక్షణకు ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు.

ఘటనకు సంబంధించి విచారణ నిర్వహించి, ప్రాథమిక నివేదిక అందజేయాలని విశాఖ రేంజ్ డీఐజీ, శ్రీకాకుళం ఎస్పీలకు తగిన ఆదేశాలు ఇచ్చామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

Related posts

“స్వంత లాభం కొంత మానుకో” తోనే పవన్ పార్టీ లో చేరా

Satyam NEWS

తెలంగాణలో ప్రత్యామ్నాయం CPI మాత్రమే

Satyam NEWS

అణగారిన వర్గాల కోసం కోవిడ్ -19 ఉచిత పరీక్షలు

Satyam NEWS

Leave a Comment