39.2 C
Hyderabad
April 25, 2024 18: 37 PM
Slider సంపాదకీయం

డామిట్ కథ అడ్డం తిరిగింది: ఎన్టీఆర్… ఎన్టీఆర్…

#ntrhealthuniversity

డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం తమ పార్టీకి తీరని నష్టం చేకూర్చిందని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకులు అంతర్మధనం చెందుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని పైకి ఖండించలేక లోలోన వారు మదన పడుతున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 50 నుంచి 60 స్కీమ్ లకు వై ఎస్ ఆర్ లేదా జగన్ పేర్లే ఉన్నాయని ఇప్పుడు కొత్తగా పేర్లు మార్చడం వల్ల వచ్చే లాభం లేదని మెజారిటీ వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్టీఆర్ పేరు మార్చిన క్షణం నుంచి వెల్లువెత్తతున్న ప్రజా వ్యతిరేకత చూసైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని తమ అధినేత వ్యవహార శైలిపై వారు చర్చించుకుంటున్నారు. గత మూడు సంవత్సరాలలో ఇంత ప్రజా వ్యతిరేకత వచ్చిన నిర్ణయం మరొకటి లేదని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ విపరీతంగా లాభపడే అవకాశం వచ్చిందని, తటస్థులుగా ఉన్న వారంతా తెలుగుదేశం సానుభూతిపరులుగా మారిపోతున్నారని వైసీపీ నాయకులు లోలోపల చర్చించుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి మేలు చేసే ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ ఎందుకు తీసుకున్నారో అర్ధం కావడం లేదని వారు అంతర్గతంగా అనుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని అంతటితో వదిలేకుండా వైసీపీ సోషల్ మీడియా మరింత దారుణమైన వ్యాఖ్యలతో ప్రచారాన్ని కొనసాగించడం కూడా తమకు మరింత నష్టం చేకూరుస్తుందని అనుకుంటున్నారు. గత రాత్రి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు ఎన్టీఆర్ కు చేసిన ద్రోహం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

చంద్రబాబు పై అత్యంత దారుణమైన వ్యాఖ్యలతో సోషల్ మీడియా క్యాంపెయిన్ ప్రారంభించడం కూడా తమ పార్టీకి మరింత నష్టం చేకూరుస్తుందని భావిస్తున్నారు. అమరావతి ని ఏకైక రాజధానిగా కొనసాగించే విషయంలో మంకుపట్టుపట్టి కూర్చున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కూడా సమర్థించే వారు ఉన్నారేమో కానీ ఎన్టీఆర్ పేరు మార్చడంలో సమర్థించేవారు మాత్రం కనిపించడం లేదని వైసీపీ నేతలే అంటున్నారు.

రాత్రికి రాత్రి ఎన్టీఆర్ పేరు మార్చేనిర్ణయం ఆదరాబాదరాగా తీసుకోవడం ముఖ్యమంత్రి సొంత నిర్ణయమనేది వైసీపీ నేతలే ప్రచారం చేయడం మరో ముఖ్య అంశం. తమకు ఇష్టం లేకపోయినా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు ప్రయివేటు చర్చల్లో వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. వైసీపీ పార్టీ సంగతి పక్కన పెట్టినా ఈ నిర్ణయం వై ఎస్ జగన్ వ్యక్తిగత ఇమేజికి పెద్ద దెబ్బగా పలువురు భావిస్తున్నారు.

Related posts

కోనసీమలో కరోనా కలకలం.. 24 విద్యార్థులకు పాజిటివ్..

Satyam NEWS

వరద సాయం అందని నగరవాసుల ఆందోళన

Satyam NEWS

ఈవీఎం లపై పూర్తి అవగాహన ఉండాలి

Satyam NEWS

Leave a Comment