Slider సంపాదకీయం

జగన్‌ IPS సునీల్‌పై వేటు… వైసీపీకి డేంజర్‌ బెల్స్‌….!!

#jagan

ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయా..?? టీడీపీ యువనేత, మంత్రి లోకేష్‌ రెడ్‌ బుక్‌లో మరో పేజ్‌ ఓపెన్‌ అయిందా..?? ఈసారి రాజకీయ నేతలపై కాకుండా అధికారులపై వేటు పడిందా..?? జగన్‌ సర్కార్‌లో విచ్చలవిడి అవినీతి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అరాచక అధికారులపై కొరడా ఝుళిపిస్తోంది కూటమి ప్రభుత్వం.. సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ని సస్పెండ్‌ చేసింది చంద్రబాబు సర్కార్‌..

గత పది రోజుల గ్యాప్‌లోనే ఏపీ రాజకీయాలు ఊహించని విధంగా వేడి ఎక్కాయి.. ఇప్పటికే వైసీపీ జమానాలో నోరు పారేసుకున్న వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయ్యారు.. ఇటు అధికారులనూ వదలడం లేదు కూటమి ప్రభుతవ్ం.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారనే అభియోగాలు నిర్ధారణ కావడంతో ఆయనను సస్పెండ్‌ చేసింది ప్రభుత్వం…. యూఏఈ పర్యటనకు వెళ్లి వస్తానని అధికారికంగా అనుమతులు తీసుకున్న సునీల్‌ కుమార్‌.. ఆ తర్వాత ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వివిధ దేశాలలో పర్యటించారు.. ఇది ఆయన ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడమే..

సునీల్‌ కుమార్‌ అనుమతులు లేకుండా ఏయే దేశాలలో పర్యటించారో ఒకసారి చెక్‌ చేద్దాం…..

2024 ఫిబ్రవరి లో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని ప్రభుత్వం ఇచ్చిన వివరాలను డివియేట్ చేసి దుబాయ్ లో  సునీల్ కుమార్ పర్యటించారు.

2023 సెప్టెంబర్ 2వ తారీఖున  ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఎమిరేట్స్ విమానం EK 525 లో హైదరాబాద్ నుండి స్వీడన్ దేశం వెళ్లి 2023 సెప్టెంబర్ 11న ఎమిరేట్స్ విమానం EK 526 లో హైదరాబాద్ తిరిగివచ్చారు సునీల్ కుమార్

2023 ఫిబ్రవరి 1న హైదరాబాద్ నుండి EK 525 విమానం లో దుబాయి మీదగా అమెరికా వెళ్లి 2023 ఫిబ్రవరి 28 న EK 524 విమానం లో అమెరికా నుండి హైదరాబాద్ కు దుబాయ్ మీదగా తిరిగి వచ్చారు. అయితే ఈ పర్యటనకు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి తీసుకోలేదు.

డిసెంబర్ 14 2022 నుండీ డిసెంబర్ 19 2022 వరకు జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని దుబాయ్ లో పర్యటించారు.

2021 అక్టోబర్ 2న EK 525 విమానంలో హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లి అక్టోబర్ 10 న EK 524 విమానంలో తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఈ పర్యటనకు ప్రభుత్వ అనుమతి లేదు.

21 డిసెంబర్ 2019 నుండి 4 జనవరి 2020 వరకు అమెరికా లో పర్యటించేందుకు అనుమతి తీసుకుని అనుమతులకు విరుద్ధంగా యునైటెడ్ కింగ్డమ్ లో పర్యటించారు.

ఇలా పలుమార్లు ప్రభుత్వ అనుమతులు ఉల్లంఘించి పలుమార్లు ప్రభుత్వం నుండి అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలు చేసిన  సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాదు, ఇటీవల ఎస్‌సీ వర్గీకరణపై ప్రభుత్వానికి వ్యతిరేంగా మాల సామాజిక వర్గం నేతలు ఒంగోలులో నిర్వహించిన సభకు సునీల్‌ కుమార్‌ హాజరయ్యారు.. ఆ సభలో ఆయన ప్రసంగించారు.. ప్రభుత్వం ఎస్‌సీ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే, దానిపై పోరాటం చేయాలని, శాసనసభను ముట్టడించాలని ఆయన సూచించారు.. దీనిపైనా త్వరలోనే విచారణ జరగనుందని తెలుస్తోంది..

మొత్తమ్మీద, జగన్‌ సర్కార్‌ హయాంలో విచ్చలవిడిగా రెచ్చిపోయిన నేతలు, అధికారులను కూటమి సర్కార్‌ శిక్షిస్తోంది.. ఏపీ సమాజంలో ఇలాంటి నేర స్వభావం, రూల్‌ ఆఫ్‌ లాని వ్యతిరేకించే వారికి శిక్షలు తప్పవని చంద్రబాబు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది.. మరి, రాబోయే రోజులలో ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారో చూడాలి..

Related posts

విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం

mamatha

మాజీ భర్త పేరు తీసేసిన సానియా మీర్జా

Satyam NEWS

రైతు జీవితం గడపడం గొప్ప వరం

Satyam NEWS

Leave a Comment