28.7 C
Hyderabad
April 25, 2024 03: 05 AM
Slider పశ్చిమగోదావరి

ఏ మాత్రం రక్షణ లేని భయంకర ప్రయాణం ఇది

#bridge

ప్రయాణికులు పడే ఆందోళన ఇది. అసలే కుంగిపోయిన వంతెన… అంతేకాదు వంతెనకు రెండు ప్రక్కల రక్షణ లేని భయంకర ప్రయాణం. అదుపు తప్పితే అంతే సంగతులు….జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు?

ఈ పరిస్థితి అంతా పశ్చిమగోదావరిజిల్లా కామవరపుకోట మండలం కళ్లచెర్వు లింగపాలెం మండలం ఆసన్నగూడెం గ్రామాల మధ్య గుండేరు వాగుపై సుమారు వందేళ్లనాడు నిర్మించిన ప్రధాన వారధి దుస్థితి. ఆ వంతెన పట్ల అధికారుల కెందుకంత నిర్లక్ష్యం?

ఈ ప్రశ్న ఆ వంతెనపై ప్రయాణించే ప్రతి ఒక్కరిది. కానీ ఎవరికి వారు మనకెందుకు అనుకుని ఆ వంతెన దాటిపోతున్న పరిస్థితి. ఆ వంతెన పొడవునా రక్షణ గోడలు లేవు. కొంత మంది యువకులు కుంగిపోయి ప్రమాదకరంగా ఉన్న వంతెనపై ద్విచక్ర వాహనాలపై మితిమీరిన వేగంతో వెళుతున్నారు.

మద్యం సేవించో, ఆద మఱిచో వాహనం నడిపితే జరగబోయే ప్రమాదం పై ఆ వంతెనపై వెళ్లే ప్రయాణికుల్లో ఎంతమందికి అవగాహన ఉంటుంది? ఎందుకింత నిర్లక్ష్యం? ఈ వంతెనపై ఓవర్ లోడ్ లతో ట్రాక్టర్ లు లారీలు వంటి భారీ వాహనాలు, జె సి బి లు రాకపోకలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.

ఇటువంటి ప్రమాదకర వంతెనకు ఇటువైపు గాని అటువైపు గాని ఎటువంటి హెచ్చరిక సూచనలు లేకపోవడం విశేషం.

Related posts

హైదరాబాద్‌కు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు కదిలాయి

Sub Editor

కోతుల సామూహిక మరణం: విషప్రయోగమే కారణమా?

Bhavani

హుజూరాబాద్ కు మరో రూ.500 కోట్లు విడుదల

Satyam NEWS

Leave a Comment