25.2 C
Hyderabad
November 4, 2024 20: 49 PM
Slider సంపాదకీయం

జగన్‌ టీమ్‌ చీకటి కుట్రలు…

#jagan

నవ్యాంధ్రప్రదేశ్ లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాగించిన ఐధేళ్ల పాలన సాంతం అరాచకమేనని విపక్షాలు ఆరోపిస్తూ ఉంటే…అవన్నీ రాజకీయ ఆరోపణలు మాత్రమే, జగన్ అంతగా అరాచకం ఏమీ చేసి ఉండరని చాలా మంది అనుకున్నారు. అయితే జగన్ జమానాలో రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టిన జీవోలు ఇప్పుడు ఆ భావన తప్పు… జగన్ సాగించింది ముమ్మాటికీ అరాచక పాలనేనని బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి.

మొన్నటి ఎన్నికల్లో జనం చేతిలో ఘోరాతిఘోరమైన ఓటమిని చవిచూసిన వైసీపీ…ఆ ఘోర పరాాభవానికి జగన్ అనుసరించిన అరాచక పాలనే కారణమన్న వాదనలకూ బలం చేకూరుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ కూటమి సర్కారు… తన 4 నెలల పాలన తర్వాత జగన్ జమానాలో చీకటి జీవోలుగా ముద్రపడి… బహిర్గతం కాని జీవోలను తాజాగా బహిర్గతం  చేసింది. ఈ .జీవోలను పరిశీలించిన వారెవరైనా… జగన్ పాలన సాంతం అరాచకంగానే సాగిందని ఒప్పుకోక తప్పదు..

జగన్ ను రాజకీయంగా ఎవరు విమర్శించినా… జగన్ స్పందించేందుకు కాస్తంత సమయం తీసుకుంటారేమో గానీ… ఆయన పెంచి పోషిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు మాత్రం క్షణం కూడా ఆగరు. జగన్ పై విమర్శలు వచ్చినంతనే… సదరు విమర్శలు చేసిన వ్యక్తి, సంస్థలపై మూకుమ్మడిగా దాడికి దిగిపోతారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు బాగా పెరిగిపోయిన ఈ సంస్కృతి… జగన్ మాజీ సీఎం అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొనసాగుతోంది. దీనికి కారణం… జగన్ జమానాలో విడుదలైన చీకటి జీవోలే కారణమని కూడా చెప్పక తప్పదు.

ఎందుకంటే… ఈ చీకటి జీవోల కారణంగా వైసీపీ సోఫల్ మీడడియాకు చెందిన వారికి జగన్ అందిన కాడికి ప్రజా సొమ్మును దోచి పెట్టేశారు. అర్హత లేకున్నా… పనిచేయకున్నా… నెలకు లక్షల రూపాయల వేతనం ఇస్తూ జగన్ ఉద్యోగాలు కల్పించారు కదా… ఆ మాత్రం జగన్ కు రుణపడి ఉండాలి కదా అన్న భావనతో… జగన్ ఓడినా ఆయనపై ఈగ వాలకుండా వైసీపీ సోషల్ మీడియా భీకర దాడులకు దిగుతోంది. కూటమి సర్కారు బహిర్గతం చేసిన చీకటి జీవోల్లో పలు ఆశ్చర్యపోయే అంశాలు ఉన్నాయి.

ఆ వివరాల్లోకి వెళితే… జగన్ అంటే వల్లమాలిన అభిమానం చూపడంతో పాటుగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు తనను తాను గురువుగా అభివర్ణించుకునే అవుతు శ్రీధర్ రెడ్డికి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అడ్వైజర్ గా పోస్టింగ్ ఇచ్చిన జగన్ సర్కారు.. ఆయనకు నెలకు ఏకంగా  రూ.3 లక్షల వేతనాన్ని చెల్లించింది. ఆయనపై న్యాయమూర్తులను దూషించిన కేసు కూడా నమోదైంది.

ఇక చంద్రబాబు, లోకేశ్ తదితరులను ఇష్టారాజ్యంగా దూషిస్తూ పోస్టులు పెడుతూ ఇటీవలే అరెస్టై, ఆ వెంటనే విడుదలైపోయిన ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తికి ఏకంగా రెండు పోస్టులు ఇచ్చిన జగన్ సర్కారు…ఏపీటీడీసీ, స్కిల్ డెవలప్ మెంట్ ల నుంచి ప్రతి నెలా క్రమం తప్పకుండా లక్షలాది రూపాయల వేతనాలు చెల్లించింది. ఎన్నికల వేళ ఈ వేతనాలతో పాటుగా నేరుగా సజ్జల నుంచి కూడా కొంత మొత్తాలను ఇతనికి విడుదల చేసింది. అక్కడికి సరిపోదన్నట్లుగా ఇంటూరి సతీమణికి కూడా ఇంటిలో కూర్చోబెట్టి మరీ ప్రతి నెలా వేతనం చెల్లించింది.

ఇక జగన్ సొంతూరు పులివెందులకు చెందిన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తికి డిజిటల్ కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టు ఇచ్చి… దాని ద్వారా నెలకు రూ.2 లక్షల వేతనాన్ని చెల్లించింది. మధుసూదన్ రెడ్డి సతీమణికి కూడా ఎలాంటి పోస్టు ఇవ్వకుండానే… ఐదేళ్ల పాటు ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనం చెల్లించారు. సుమ తియ్యగూర పేరిట సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా కనిపించే మహిళకు ఏపీడీసీలో డైరెక్టర్ పోస్టు కట్టబెట్టి… దాని ద్వారా ఆమెకు నెలకు రూ.2 లక్షల వేతనం చెల్లించారు.

ఇక ఆమె భర్తకు ఈ- ప్రగతిలో ఏదో పోస్టు పేరిట లక్షకు పైగా వేతనాన్ని చెల్లించారు. వైసీపీకి పీఆర్వోగా పనిచేసిన మస్తాన్ రావుకు ఆర్టీజీఎస్ లో పోస్టింగ్ ఇచ్చి నెలకు రూ.1.5 లక్షల వేతనాన్ని చెల్లించారు. ఆర్టీజీఎస్ లో మస్తాన్ రావుతో పాటు మరో 40 మంది దాకా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు పోస్టింగులు ఇచ్చి లక్షల రూపాయల వేతనాలు చెల్లించారు. ఇక జగన్ పీఏ కేఎన్నార్ కుటుంబానికి సన్నిహితులనే నెపంతో ఏపీడీసీలో ఆరుగురికి ఉద్యోగాలు ఇచ్చారు.

ఇంకో ఆశ్చర్యపోయే విషయమేమిటంటే.. జగన్ జమానా ముగిసినా… ఆ ఆరుగురిలో ఇప్పటికీ ఇద్దరు, ముగ్గురు ఏపీడీసీలో ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారట. ఇక ఐడ్రీమ్ అదినేత చినవాసుదేవరెడ్డి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డిలకు జగన్ సర్కారు దోచిపెట్టింది ఎంతన్నదానిపై అసలు లెక్కే లేదు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. కూటమి సర్కారు బహిర్గతం చేసిన జీవోలన్నీ పరిశీలిస్తే… ఇలాంటి వారి జాబితా చాంతాడంత అవడం ఖాయమేనని చెప్పక తప్పదు.

Related posts

కొల్లాపూర్ లో విచ్చలవిడిగా ‘‘మినరల్ వాటర్ మాఫియా’’

Satyam NEWS

ఎన్‌ఎం‌సి సంతృప్తి చెందాలి

Murali Krishna

మంచి సందేశం ఇచ్చే చిత్రం పలాస 1978

Satyam NEWS

Leave a Comment