సాహో ప్రభాస్, డార్లింగ్ లాంటి కంప్లీట్ లవ్ స్టోరీ చేసి చాలా రోజులు అయింది. గత ఐదారేళ్లుగా యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తున్న ప్రభాస్, రీసెంట్ గా సాహో సినిమాతో టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురిపించాడు. ముఖ్యంగా నార్త్ తో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ఏంటో సాహో సినిమా నిరూపించింది. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే ప్రభాస్, తన సొంత బ్యానర్ అయిన గోపికృష్ణ మూవీస్ నిర్మాణంలో ఒక సినిమాని మొదలు పెట్టాడు. యూరోప్ లో ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాని జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. జాన్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ పక్కన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.1960 కాలంలో జరిగిన ఓ థ్రిల్లింగ్ ప్రేమకథతో తెరకెక్కనున్న సినిమాని హైదరాబాద్ లోనే యూరప్ సెట్ వేసి షూట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే గతంలో షూట్ చేసిన సీన్స్ ఉంటాయా లేక మళ్లీ కొత్తగా వాటిని కూడా తీస్తారా అనేది చూడాలి.2020 చివరలో ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమా, ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది ,
previous post
next post