28.2 C
Hyderabad
April 20, 2024 14: 23 PM
Slider ఆధ్యాత్మికం

బాసరలో దసర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

#BasaraTemple

నిర్మల్ జిల్లా బాసర శ్రీ సరస్వతి అమ్మవారి సన్నిధిలో లో 17 వ తేదీ దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 25 వ తేదీ వరకూ దసరా మహోత్సవాలు జరుగనున్నాయి.

కరోనా కట్టడి లో భాగంగా వ్యక్తిగత నియమాలు పాటించే దిశగా చర్యలు తీసుకున్నారు.  శుక్రవారం (17-10-2020) ఉదయం అమ్మవారి ఆలయంలో ఘట స్థాపన కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. 

ఈ రోజు రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిని రూపములో భక్తులకు దర్శన భాగ్యము కల్పించారు. ఈ రోజు అమ్మవారి సన్నిధిలో భక్తులు వారి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తూ వారి పిల్లలకు మంచి బుద్దిని, మేధస్సును, జ్ఞానమును ఇవ్వమని కోరుకుంటున్నారు.

ఈ నెల 25 వ తేదీన ఉదయం చండీయాగ పూర్ణాహుతి, ఆయుధ పూజ, శమీ పూజ తో ఉత్సవాలు ముగియనున్నాయి.

ఉత్సవాల అనంతరం పరోక్ష సేవలు, హోమాలన్ని యధావిధిగా కొనసాగనున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. దసరా మహోత్సవాలలో వచ్చే మూలానక్షత్రం రోజున విశేష సంఖ్యలో యాత్రికులు అమ్మవారి సేవలో పాల్గొననున్నట్లు ఆలయ అధికారులు అంచనాలు వేశారు.

అమ్మవారి మూలా నక్షత్రానికి అంటే 21వ తేదీ నాడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పణ, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఉత్సవాలలో విశేష అలంకార సేవలు ఇవి: 17-10-2020 శైలపుత్రి

18-10-2029 బ్రహ్మ చారిని

19-10-2020 చంద్రఘంట

20-10-2020 కూష్మాండ దుర్గ

21-10-2020 స్కంద మాత

22-10-2020 కాత్యాయని

23-10-2020 కాళరాత్రి

24-10-2020 మహాగౌరి

25-10-2020 సిద్ధి దాత్రి

Related posts

మొబైల్ పోయిందనే ఆందోళన వదిలేయండి

Satyam NEWS

స్టాండింగ్ కమిటీ మెంబర్ గా పన్నాల

Satyam NEWS

సిఎం సహాయ నిధి చెక్కులు పంచిన ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment