31.2 C
Hyderabad
April 19, 2024 05: 36 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీశైలం లో సకల శుభప్రదాయిని కాత్యాయని దేవి దర్శనం

#srisailam

అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలమహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా మహోత్సవాలలో భాగంగా  మంగళవారం కర్నూలు జిల్లా శ్రీశైలంలో  శ్రీ భ్రమరాంబ దేవి కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది కనులారా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.

నవదుర్గలలో ఆరవ రూపమైన ఈ దేవి చతుర్భుజాల ను కలిగి ఉండి కుడివైపున అభయ హస్తాన్ని వరముద్రను ఎడమవైపున పద్మాన్ని ఖడ్గాన్ని ధరించి ఉంటుంది కాత్యాయని దేవిని ని ఆరాధించడం వలన రోగ శోక భయాలను తొలగించుకోవచ్చు నని చెప్పబడుతోంది.

హంస వాహనంపై శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉత్సవమూర్తులను అధిరోహింప చేసే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాకార ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో లవన్న దంపతులు, వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు. ఉదయం అమ్మవారికి విశేష కుంకుమార్చనలు చండీ హోమం, పంచాక్షరి, చండీ పారాయణ, చతుర్వేద పారాయణ ,కుమారి పూజలు జరిపించారు.

Related posts

సరుకు రవాణాలో విశాఖ పోర్టు ట్రస్టు నూతన అధ్యాయం

Satyam NEWS

మ్యుటేషన్ లంచాల వద్ద అధికారుల మధ్య పేచీలు: విఆర్ఓ లపై చర్యలు

Satyam NEWS

సుమసిరి

Satyam NEWS

Leave a Comment