29.2 C
Hyderabad
November 4, 2024 18: 50 PM
Slider ఆధ్యాత్మికం

ఇంద్రకీలాద్రిపై మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి

#indrakeeladri

శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజున శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తోంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం బాలా త్రిపుర సుందరీదేవి కనిపించడం భక్తులకు ఆనందం కలిగించింది. ఈ తల్లిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయనీ, సర్వ సంపదలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

వేకువజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు నుండి 12వ తేదీ వరకూ రోజుకో అలంకారంలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. భక్తుల కొంగుబంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు. దీంతో ఆలయం, పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. దసరా ఉత్సవాల వేళ అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు.

ఈ ఉత్సవాల్లో నిత్యం లక్షకుపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారని అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా దాదాపు నాలుగున్నర వేల మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. ఆలయం వద్ద భక్తుల రద్దీని సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిశితంగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మరో పక్క ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర వివరాలను భక్తులు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ ను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకుచ్చారు.   

Related posts

సూసైడ్:నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

Satyam NEWS

అనంతపురం జిల్లాలో వజ్రాల వేట

Satyam NEWS

బాధితుల గోడు ఆలకించిన విజయనగరం పోలీసు బాస్

Satyam NEWS

Leave a Comment