సిద్ధిపేట సీపీ శివకుమార్ తో ఉన్న విభేదాల కారణంగానే తనపై కక్ష సాధింపు చేపట్టి ఆయుధాల అపహరణ నిందలు తనపై వేశారని రిటైర్డ్ సీఐ భూమయ్య అన్నారు.సిద్దిపేట జిల్లా అక్కన్న పేటలో ఏకే47 గన్ తో జరిగిన కాల్పుల ఘటనపై అయన మీడియాతో మాట్లాడారు. రెండు సంవత్సరాల క్రితం తాను హుస్నాబాద్ నుంచి బదిలీ అయిన రెండునెలల తర్వాత తుపాకులు మాయమయ్యాయని చెప్పారు.
తుపాకులతో సంబంధంలేని తనపై ,తన గన్ మెన్ పై కొందరు అధికారులు తప్పును నెట్టే ప్రయత్నం చేశారని అన్నారు. బులెట్ పోతెనే కఠిన చర్యలు తీసుకునే డిపార్ట్ మెంట్ రెండు తుపాకులు పోయినా ఎందుకు పట్టంచుకోలేదని ప్రశ్నించారు. పైగా తనపైనే తుపాకుల దొంగతనం మోపి మానసికంగా పై అధికారులు వేధించారని చెప్పారు. తుపాకులు పోవడానికి అప్పటి ఎస్సై దే నిర్లక్ష్యమని ,సదానందం కాల్పులు జరగక పోయివుంటే ఆ నింద నామీదే ఉండేదని అన్నారు.
అప్పటి సిద్ధిపేట సీపీ శివకుమార్ తో ఉన్న విభేదాల కారణంగానే తనపై కక్ష సాధింపు జరిగిందని చెప్పారు. తుపాకులు టెర్రరిస్టుల చేతికి, నక్సల్స్ చేతికి పోయివుంటే ఏమయ్యేదని అన్నారు. ఒక వేల సదానందం ఆటోమోడ్ లో పెట్టి ఫైర్ చేస్తే చాలా విధ్వంసం జరిగేదని తెలిపారు.ఇప్పటికైనా అధికారులు విచారణ జరిపి నిజమైన దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు.