సంసార బాంధవ్యాలలో చిక్కుకుపోయి మానసిక ప్రశాంతతకు దూరమౌతున్నారని, యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డారని, వీటినుండి విముక్తి లభించాలంటే.. ఆధ్యాత్మిక చింతన ఒక్కటే మార్గమని విశాఖ శ్రీ శారదా పీఠ ఉత్తర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వామి ప్రవచించారు. హనుమకొండ హంటర్ రోడ్ లోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంత రావు ఇంట్లో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన బుధవారం రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంత రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ దంపతులు, తెలంగాణా ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ సీ అండ్ ఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఇంటెలిజెన్స్ ఐ జీ నవీన్ చంద్, ఎంపీ పసునూటి దయాకర్, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, వరంగల్ అర్బన్ జెడ్పీ చైర్ పర్సన్ డా. సుధీర్ కుమార్ వొడితల కుటుంబ సభ్యులు వొడితల కిషన్ రావు, శ్రీనివాస రావు, కౌశిక్, ఇంద్రనీల్, పూజిత తదితరులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. నాలుగోరోజు శరన్నవరాత్రి కార్యక్రమాల్లో భాగంగా చండీ పారాయణం, చండీ హోమం, లలితా సహస్ర నామార్చన, రుద్రాభిషేకం, రాజ శ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అద్భుతంగా నిర్వహించారు. వేదపండితులు రుద్రం నమక చమకం, శ్రీ సూక్తం, పురుష సూక్తం పఠిస్తుండగా పంచామృతాలతో.. వివిధ రకాల పూలతో, పత్రితో, భస్మంతో, పంచామృతాలతో శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు స్వయంగా చేసిన అభిషేకం భక్తులను, మహిళలను మంత్ర ముగ్దులను చేసింది. శ్రీ రాజశ్యామల అమ్మవారికి అభరణాలతో.. పట్టు వస్త్రాలతో చేసిన అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. మహిళలు అమ్మవారికి సంబంధించిన స్తొత్రాలను భక్తి శ్రద్దలతో పఠించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ స్వాత్మామందేంద్ర స్వామి వారు భక్తులకు ఉపదేశం చేసారు. ప్రతిరోజు భగవత్ ధ్యానం చేయాలని, దేవాలయాలను సందర్శించడం, దాన ధర్మాలు చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. యాంత్రిక మయమైన, బంధాలు, బాంధవ్యాలతో నిత్యం సతమతమయ్యే జీవనంలో మనిషి మానసికమైన తృప్తిని అనుభవించలేక పోతున్నాడని.. వీటన్నింటికి దైవ చింతనే పరిష్కారమని బోధించారు
previous post
next post