31.2 C
Hyderabad
April 19, 2024 05: 42 AM
Slider జాతీయం

రాఫెల్ ఫైటర్ జెట్ ల కొనుగోలులో ముడుపులు?

#RafalFighterJets

రాఫెల్ జెట్ ఫైటర్ల కొనుగోలులో ముడుపులు ముట్టాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చాలా కాలంగా చేస్తున్న ఆరోపణలు నిజమని తేలుతున్నాయి.

రాఫెల్ ఫైటర్ జెట్ ల కొనుగోలులో భారతీయ మధ్య వర్తికి ఒక మిలియన్ యూరోలు అంటే సుమారుగా రూ.8.62 కోట్ల మేరకు జరిపిన చెల్లింపులపై స్పష్టత నివ్వడంలో డస్సాల్ట్ కంపెనీ విఫలం అయింది.

రాఫెల్ ఫైటర్ జెట్ ల అమ్మకాలకు సంబంధించి ఫ్రెంచ్ అవినీతి నిరోధక విభాగం కేసు దర్యాప్తు చేస్తున్నది.

ఈ దర్యాప్తులో భాగంగా రాఫెల్ ఫైటర్ జెట్ ల అమ్మకంలో భారతీయ మధ్య వర్తికి జరిపిన చెల్లింపులపై సంబంధిత కంపెనీ డస్సాల్ట్ ను ప్రశ్నించింది.

అవినీతి నిరోధక విభాగం వేసిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడంలో డస్సాల్ట్ కంపెనీ విఫలమైందని ఆన్ లైన్ జర్నల్ మీడియాపార్ట్ ఆదివారంనాడు వెల్లడించింది.

రెండు దశాబ్దాల కాలంలో రాఫెల్ ఫైటర్ జెట్ ల కొనుగోలు ఒప్పందమే భారత్ జరిపిన భారీ ఒప్పందం.

మిలియన్ యూరోల చెల్లింపులపై అవినీతి నిరోధక విభాగం సంధించిన ప్రశ్నలకు కంపెనీ సమాధానం చెప్పకపోవడంతో రాఫెల్ ఫైటర్ జెట్ ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందనే ఆరోపణ నిజమని తేలుతున్నది.

2017లో రాఫెల్ ఫైటర్ జెట్ ల కొనుగోలు ఒప్పందం కుదిరింది.

Related posts

ఏసీబీ వలలో సబ్ రిజిస్టర్

Bhavani

యానిమల్ వెల్ఫేర్: నట్టల నివారణ మందుల పంపిణీ

Satyam NEWS

రాజకీయాన్ని వ్యాపారం చేయడాన్ని ముక్తకంఠంతో ఖండించాలి…!

Bhavani

Leave a Comment