రాష్ట్రంలో ఖర్జూరం సాగు అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం రాయలసీమకు చెందిన ఖర్జూరం సాగు రైతులు సచివాలయంలో మంత్రి కి తమ సమస్యలు తెలియచేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు ఖర్జూరం సాగు ప్రోత్సహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే 700 ఎకరాల మేర ఖర్జూరం పంట సాగు అవుతోందని, మొక్కల ఖర్చు భారం తగ్గించడంతో పాటు, రాయితీపై బిందు సేద్యం రైతులకు అమలు చేయాలని రైతులు మంత్రి ని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు ఉపాధి హామీ పథకంలో ఖర్జూరం సాగు ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని, త్వరలో బిందు సేద్యం రాయితీలో అందిస్తామని తెలిపారు. మొక్కల నాణ్యత పరిశీలన అంశంలో ఉద్యాన శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని రైతులకు సూచించారు.
previous post