36.2 C
Hyderabad
April 25, 2024 21: 30 PM
Slider జాతీయం

సుపారీ ఇచ్చి తండ్రిని హత్య చేయించిన కూతురు

#rajasthanpolice

వ్యసనాలకు బానిస అయి అప్పులు చేస్తున్న తండ్రిని ఎలా వదిలించుకోవాలో ఆ అమ్మాయికి తెలియలేదు. దాంతో తన ప్రియుడికి డబ్బులు ఇచ్చి హత్య చేయించేసింది…. అమ్మో ఇంత దారుణానికి ఆ అమ్మాయి ఒడిగట్టిందా? అని అనుమానపడవద్దు.

రాజస్థాన్ లోని కోటాలో ఈ దారుణ సంఘటన జరిగింది. మృతుడు రాజేంద్ర మీనా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. అతనికి ఇద్దరు భార్యలు. అతనికి మొదటి భార్య కు కూతురు శివాని ఉంది. భార్యాభర్తలిద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు. రాజేంద్ర ఒక ఇల్లు సుల్తాన్‌పూర్‌లో ఉండగా, మరొక ఇల్లు బిస్లాయి గ్రామంలో ఉంది.

శివాని తన తల్లి సుగ్నాతో కలిసి సుల్తాన్‌పూర్‌లోని ఇంట్లో ఉంటోంది. డ్రగ్స్‌కు బానిసై అప్పులపాలైన రాజేంద్ర సుల్తాన్‌పూర్‌లోని ఇంటిని విక్రయించాలనుకున్నాడు. ఈ ఇల్లు మొదటి భార్య పేరు మీద ఉంది. అప్పులు ఇచ్చేవారు డబ్బు కోసం ఈ ఇంటికి వచ్చేవారు.

దీంతో శివాని కంగారుపడింది. కోపంతో తండ్రి రాజేంద్రతో మాట్లాడడం కూడా మానేసింది. సుల్తాన్‌పూర్‌లోని ఇంటిని అమ్ముతున్న విషయం తెలుసుకున్న శివాని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత తన తండ్రి రాజేంద్ర మీనాను హత్య చేసేందుకు కుట్ర పన్నింది. దీని కోసం ఆమె ప్రేమికుడు అతుల్ మీనాను చేరదీసింది.

50 వేలు సుపారి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. అవకాశం కోసం చూసుకున్న అతుల్ తన మిత్రులతో కలిసి రాజేంద్ర పై దాడి చేశాడు. జూన్ 25 తెల్లవారుజామున రాజేంద్ర మీనా తన బైక్‌పై బిస్లాయి నుంచి సుల్తాన్‌పూర్‌కు వస్తున్నాడు. మార్గమధ్యంలో దుండగులు అతడిపై ఆయుధాలతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు.

గాయపడిన రాజేంద్రను బంధువులు ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శివాని తండ్రి రాజేంద్ర మీనా మూడేళ్ల క్రితం అతుల్ గ్రామమైన నాపహెరాకు బదిలీ అయ్యారు.

ఇక్కడే శివాని, అతుల్ మధ్య స్నేహం ఏర్పడి అది క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరం మూడేళ్లు కలిసి ఉన్నారు. అతుల్ నేర స్వభావం కలవాడు. మృతుడి కుమార్తె శివాని (19), ప్రేమికుడు అతుల్ అలియాస్ శాంతి (20) , లలిత్ మీనా (21), విష్ణు భిల్ (21), విజయ్ సైనీ (20) అరెస్టు అయిన వారిలో ఉన్నారు.

Related posts

శుభ ‘ కృతి ‘ కి స్వాగతం

Satyam NEWS

గిడ్డంగుల సంస్థ చైర్ ప‌ర్స‌న్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన రజనీ

Bhavani

పావురాల కుంటకు నీరు తరలింపు

Satyam NEWS

Leave a Comment