28.2 C
Hyderabad
April 20, 2024 12: 18 PM
Slider విజయనగరం

పట్టపగలు కర్ఫ్యూ అమలు చేస్తున్న ఖాకీలు… అందుకే..!

#Vijayanagaramroads

ఏదైనా ఘర్షణలు చెలరేగినప్పుడు లేదా ఆందోళనలు తలెత్తినప్పుడు,దాని సందర్భంగా ఎవ్వరైనా మూతి చెందితే తక్షణమే ఏ ప్రభుత్వమైనా అమలులోకి తీసువచ్చే అస్త్రం…’కర్ఫ్యూ’.కరోనా పుణ్యమా ఆ అస్త్రాన్ని సంధించింది…జగన్ ప్రభుత్వం.

వేల సంఖ్యలో కరోనా కేసులు పెరగడం చికిత్స కు తగినంత సదుపాయాలు లేక పోవడంతో కర్ఫ్యూ అస్త్రాన్ని ప్రయోగించింది.రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచీ కేవలం ఆరుగంటలు మాత్రమే ప్రజలకు అనుమతి ఇచ్చింది.

ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచీ మర్నాడు 6 గంటల వరకూ అన్నీ బంద్. ప్రభుత్వ, ప్రైవేటు ఇలా అన్నింటికీ ఆదేశాలు ఇచ్చేశాయి…సంబంధిత సంస్థలు, ఆఫీసులు.దీంతో పట్టపగలే మిట్ట మధ్యాహ్నం విజయనగరం జిల్లాలో ని అన్ని ప్రధాన జంక్షన్ లు పట్టణాలు నిర్మాణుష్యంగా మారాయి.

జిల్లా కేంద్రమైన విజయనగరం లో మరీనూ.ప్రధాన జంక్షన్ లు అయిన ఆర్టీసీ కాంప్లెక్స్, మయూరి జంక్షన్, రైల్వే స్టేషన్, బాలాజీ జంక్షన్, కోట‌ ,మూడులాంతర్లు, గంటస్థంభం,పీడబ్ల్యూ మార్కెట్ వంటి రద్దీగా ఉన్న ప్రదేశాలు కాస్త నిర్మాణుష్యంగా తయారైపోయాయి.

18 గంటల పాటు కర్ఫ్యూ ను అమలు చేసేందుకు అటు లా అండ్ ఆ‌ర్డర్ ,స్పెషల్ ప్రోటెక్షన్ ఫోర్స్ లు రంగంలో కి దిగాయి.ఈ మేరకు నగరంలో కర్ఫ్యూ పరిస్థితి ని విజయనగరం డీఎస్పీ అనిల్ ,స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాసరావు లు పర్యవేక్షించారు. అన్ని జంక్షన్ వద్ద బారికేడ్లు, చెక్ పోస్ట్ ల వద్ద తనిఖీలు ముమ్మరం చేసారు…పోలీసులు తమ ఎస్పీ ఆదేశాలతో.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్

Related posts

ఆర్ధిక పరిస్థితిలో డొల్లతనాన్ని బయటపెట్టిన మూడీస్

Satyam NEWS

అరంగేట్రంతోనే అదరగొట్టిన కత్తిలాంటి కొత్త కుర్రాడు అసిఫ్ ఖాన్

Satyam NEWS

మావోయిస్టు ప్రాంతాల్లో పర్యటించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ

Satyam NEWS

Leave a Comment