27.7 C
Hyderabad
April 18, 2024 10: 47 AM
Slider ముఖ్యంశాలు

ఏపీలో ప‌గటి పూట క‌ర్ఫ్యూ ఎత్తివేత‌…? ఈ నెల 11 నుంచి వర్తింపు

#police vijayanagaram

పొరుగు రాష్ట్రం బాట‌లోనే ఏపీ రాష్ట్రం ప‌య‌నిస్తుట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప‌గ‌టి పూట క‌ర్ఫ్యూని ఎత్తివేసిన కేసీఆర్ స‌ర్కార్… రాత్రి పూట మాత్ర‌మే క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తోంది.

అదే బాట‌లో జ‌గ‌న్ స‌ర్కార్ కూడ ప‌య‌నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. వాస్తవానికి 10 వ  తేదీతో ప‌ది రోజుల పాటు పొడిగించిన ఉత్త‌ర్వుల ఆదేశాలు ముగుస్తుంది.

అయితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం క‌రోనా త‌గ్గుముఖం బ‌ట్టి క‌ర్ఫ్యూ వేళ‌లపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని  ఈ నెల మొద‌టి వారంలోనే కేంద్ర మాన‌వ వ‌న‌రుల‌శాఖ లిఖిత పూర్వ‌కంగా ఆదేశాలు ఇచ్చింది.

ఈ నేప‌ధ్యంలో  కేసీఆర్ స‌ర్కార్ రాష్ట్రంలో మాదిరిగానే ఏపీ రాష్ట్రంలో కూడ జ‌గ‌న్ స‌ర్కార్… ప‌గ‌టి పూట క‌ర్ఫ్యూ ఎత్తివేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఉద‌యం 6 నుంచీ సాయంకాలం 6  వ‌ర‌కు క‌ర్ఫ్యూ స‌డ‌లింపు స‌మ‌యం పొడిగిస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే ఆ స‌మాచారం ఇంకా అధికారంగా తెలియాల్సి ఉంది.

ఇక  రోజూలానే ఏపీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు క‌ర్ఫ్యూ నిబంద‌న‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. అందులోభాగంగా రాష్ట్రంలోని విజయనగరం లో జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ న‌గ‌రంలో ప‌ర్య‌టించారు.

విజయన‌గ‌రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, గంట స్తంభం, కేపి టెంపుల్, సిఎంఆర్ జంక్షన్ ప్రాంతాలను ఎస్పీ సంద‌ర్భించారు.

మద్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంగించి తిరిగే వాహనదారులను నిలిపివేసి, వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు., సహేతుకరమైన కారణాలు తెలపని వారికి జరిమానాలు విధించారు.

ఈ ప‌ర్య‌ట‌న‌లో అదనపు ఎస్పీ సత్యనారాయణ రావు, విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్, ట్రాఫ్ఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఎఆర్ డిఎస్పీ  ఎల్.శేషాద్రి ఇతర పోలీసు అధికారులు ఈ ఆక‌స్మిక త‌నిఖీలో పాల్గొన్నారు.

Related posts

జైలుకెళ్లే జగన్ ను నమ్ముకుంటే అధికారులకు అధోగతే

Satyam NEWS

డ్రెస్‌కోడ్‌:కాశీ జ్యోతిర్లింగ దర్శనానికి సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందే

Satyam NEWS

కడప పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

Satyam NEWS

Leave a Comment