39.2 C
Hyderabad
March 29, 2024 15: 11 PM
Slider వరంగల్

దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు ఇస్తున్నాం

#DCCBMulugu

వరంగల్ అర్బన్ జిల్లా అంబెడ్కర్ భవన్ లో డీసీసీబీ చైర్మన్  మార్నేని రవీందర్ రావు మహాజన సభ సమావేశానికి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల కు రుణాలు ఇచ్చి, పాల ఉత్పత్తులు పెంపొందించేందుకు పాటు పడుతున్నామని, ప్రస్తుత పాలకవర్గం 870 కోట్ల నుండి ఈ ఆర్ధిక సంవత్సరానికి 1144 కోట్లు టర్నోవర్ జరిగిందని తెలిపారు.

ధరఖాస్తు చేసుకున్న  వారందరికీ రుణాలు ఇస్తున్నామని, గృహ నిర్మాణాలకు రుణాలు ఇచ్చేందుకు ప్లాన్ చేసాం, అమలు చేసామని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కోసం డైరీ, షిషరీస్ ఇతర వాటికి రుణాలు ఇచ్చేందుకు ప్లాన్ చేశామని తెలిపారు.

చిరు వ్యాపారులకు 90 పైసలతో రుణాలు ఇచ్చేందుకు ప్లాన్ చేసామని, సహకార సంఘాల ను బలోపేతం చేసేందుకు రుణాలు ఇచ్చి ఆర్థికంగా పటిష్ట పరుస్తున్నామని తెలిపారు. ఇంటర్నెట్, మొబైల్ ద్వారా సేవలు అందించేందుకు ప్లాన్ చేస్తున్నాం. జిల్లాలో ప్రాదమిక వ్యవసాయ సహాకార సంఘాల ఆర్ధిక పరిస్థితి ని మెరుగు పర్చుకోవడం కోసం సంఘాల అర్హత ను అనుసరించి 15 లక్షల నుండి 25 లక్షల వరకు ఎరువుల సరఫరా, విత్తన వ్యాపార నిమిత్తం సంఘాలకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి,డైరెక్టర్లు  జగన్మోహన్ రావు, రాజేశ్వర్ రెడ్డి,హరిప్రసాద్, దొంగల రమేష్,కంది శ్రీనివాస్ రెడ్డి,మాడుగుల రమేష్,చాపల యాదగిరి రెడ్డి,ఎర్రబెల్లి గోపాల్ రావు,పోలేపాక శ్రీనివాస్,నాయిని రంజీత్,మురళీ,సంపెళ్లి నర్సింగరావు, ఉపేందర్ రెడ్డి,రవి రాజ్ ,ప్రొఫెషన్ డైరెక్టర్లు నరేందర్ ,ప్రదీప్ చందర్ ,డిసిఓ నాగేశ్వర్ రావు,రూరల్ డిసిఓ పరమేష్ ,జిల్లా హార్టికల్చర్ అధికారి అక్బర్ ,జనగామ డిసిఓ మద్దిలేటి ,ములుగు డిసిఓ విజయ భాస్కర్,నా బర్ద్ డీడీఎం చంద్ర శేఖర్, అగ్రికల్చర్ ఆఫీసర్లు దామోదర్ రెడ్డి ,రాఘవ రావు,స్టేట్ మార్కుఫెడ్ డైరెక్టర్ రంగారావు,మార్కుఫెడ్ డి ఎం లు మోహన్, సరిత, శ్యామ్,ఒడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి ,ఒడిసిఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి , సీఈఓ చిన్నారావు,డిజిఎం లు ఉష శ్రీ,అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

డ్రిజిలింగ్: తెలంగాణ వ్యాప్తంగా చిరుజల్లులు

Satyam NEWS

ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసరావు

Satyam NEWS

కాశ్మీర్ లోయలో ఎయిర్ షో.. ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు

Sub Editor

Leave a Comment