28.7 C
Hyderabad
April 20, 2024 06: 20 AM
Slider నల్గొండ

రైతులతో బాటు వ్యాపారులకూ డిసిసిబి రుణాలు

#Nalgonda DCCB

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఒక్కొక్క పిఎసిఎస్ సెంటర్ కు 50 లక్షల రూపాయల చొప్పున మొత్తం 16 సంఘాలకు ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేశామని ఉమ్మడి నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తెలిపారు.

హుజూర్ నగర్ లోని నియోజకవర్గ స్థాయిలో రైతు మెగా రుణమేళ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, డిసిబి CEO, జిల్లా డైరెక్టర్లు పాల్గొన్నారు.

ఇంకా హుజూర్ నగర్ మున్సిపాలిటీ చైర్మెన్ గేల్లి అర్చన రవి,జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, ఎంపీపీ గుడేపు శ్రీను వాస్, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, నేరేడుచర్ల మున్సిపాలిటీ వైస్ చైర్మెన్ శ్రీ లత రెడ్డి, నియోకవర్గస్థాయిలో ఉన్న PACS చైర్మన్లు, రైతులు హాజరయ్యారు.

నిత్యం రైతుల గురించే ఆలోచించే సిఎం కేసీఆర్

ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక్కొక్క సంఘానికి 50 లక్షలు కేటాయించడం సీఎం కెసిఆర్ నేతృత్వంలోనే జరిగిందని నిత్యం రైతుల గురించి ఆలోచించే వ్యక్తి సీఎం కావడం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు.

రైతులకు ఋణాలతో పాటు వ్యాపార సంబంధిత ఋణాలను కూడా ఇవ్వడానికి డిసిసిబి నిర్ణయం తీసుకుందని అన్నారు. ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ బ్యాంకు బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఉన్న 197 సంఘాలకు 50 లక్షల చొప్పున  25 పైసల వడ్డీతో ఋణాలు అందించనున్నట్లు తెలిపారు.

ఇప్పటి వరకు 25 వేల రూపాయలు రుణం తీసుకున్న వారు 8659 మందికి 11 కోట్ల రూపాయలు వారి ఎకౌంట్లో జమ చేశామని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకి 316 కోట్లు 81.522 మందికి ఋణమాఫీ ఖర్చు చేసిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వందే అన్నారు.

కరోనా సమయంలో కూడా రైతు కష్టం తీర్చాం

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్ లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పాతిక వేల రూపాయలు ఋణం ఉన్నవారికి ఏకకాలంలో ఋణ మాఫీ చేశామని, కరోనా సమయంలో కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా రైతుబంధు, రైతు రుణమాఫీ చేసిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని అన్నారు.

ప్రతి ఒక్కరు వారి బాధ్యతగా సంఘ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 8 కోట్లు హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని పిఎసిఎస్ సెంటర్లకు కేటాయించినందుకు సీఎం కేసీఆర్ కు, మంత్రి జగదీశ్వర్ రెడ్డికి, జిల్లా డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

ఆసుపత్రిలో చేరనున్న ఎం ఎస్ ధోని

Satyam NEWS

జాతీయ సైన్స్ డే నాడు శార్వాణీ పాఠశాల‌లో విజయనగరం పోలీస్ బాస్

Satyam NEWS

పోరుమామళ్ల వద్ద 23ఎర్రచందనం దుంగలతో 5గురు అరెస్టు

Satyam NEWS

Leave a Comment