31.2 C
Hyderabad
April 19, 2024 02: 56 AM
Slider ఖమ్మం

ఓటర్ నమోదుకు 8 వరకు గడువు

#collector

ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో దరఖాస్తు కు సమర్పించడానికి ఈ నెల 8 వ తేదీ వరకు అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకనూ దరఖాస్తు చేయని వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ కోరారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా  ఫామ్-6 ద్వారా 25,951, ఫామ్-7 ద్వారా 1,403, ఫామ్-8 ద్వారా 1,993 దరఖాస్తులు అందినట్లు ఆయన తెలిపారు. ఇట్టి దరఖాస్తులు సంబంధిత బూత్ స్థాయి అధికారి వద్ద గాని, ఆన్లైన్ www.nvsp. in ద్వారా గాని చేసుకోవచ్చని ఆయన అన్నారు.  ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు ప్రాముఖ్యతను గుర్తెరిగి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ నెల 8 లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Related posts

గ్రానైట్ వ్యాపారులకు నోటీసులు

Murali Krishna

హుజూర్ నగర్ అభివృద్ధికి మా వంతు కృషి చేస్తాం

Satyam NEWS

అగ్నిప్రమాదంలో టాటా ఏసి దగ్ధం

Satyam NEWS

Leave a Comment