37.2 C
Hyderabad
April 19, 2024 13: 14 PM
Slider సంపాదకీయం

డియర్ ప్రైమ్ మినిస్టర్: ఇక చెప్పడానికి ఏముంది?

#Narendra Modi

నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజల నుంచి ఉద్దేశించి మాట్లాడబోతున్నారని ఇప్పుడే సమాచారం వచ్చింది. ప్రధాని దేశ ప్రజలకు ఏం చెబుతారు? అనే ఆసక్తి ప్రస్తుతానికి చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అంతా అయిపోయింది.

40 రోజుల పాటు నిష్టగా పాటించిన లాక్ డౌన్ ఎగ్జిట్ ప్లాన్ అభాసుపాలు కావడంతో దేశం మొత్తం ఇప్పుడు ప్రమాదంలోనే ఉండిపోయింది. ఆర్ధిక పరిస్థితి కన్నా దేశ ప్రజల ప్రాణాలే మిన్న అని చెప్పిన పాలకుల దృష్టి ఇప్పుడు దేశ ఆర్ధిక పరిస్థితిపైకే వెళ్లింది.

రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెట్టాయని మద్యం షాపులు తెరిచినపుడే మండలం (40 రోజులు) పాటు నిష్టగా అమలు చేసిన లాక్ డౌన్ కు అర్ధమే లేకుండా పోయింది. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్ పోర్టు కూడా ప్రారంభించేందుకు చాలా రాష్ట్రాలు సిద్ధమైపోతున్నాయి. జనతా కర్ఫ్యూ కానీ, ఆ తర్వాత లాక్ డౌన్ విధించినప్పుడు కానీ దేశం మొత్తం ఒక్కటేననే భావన కలిగింది.

మద్యం కట్టలు తెంచుకోవడంతో, అదీ కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారి వారి పాలసీ వేరువేరుగా ప్రకటించేయడం చూస్తే ఒక్కో రాష్ట్రం ఒక్కో దేశంగా అనిపించింది. రాష్ట్రాల మధ్య పోలీసు పాస్ లు, అడ్డుగోడలు, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి విఐపిలు ప్రయాణించేందుకు ఎలాంటి అడ్డంకులూ లేకపోవడం, సామాన్యులు మాత్రం నానా అగచాట్లు పడటం లాంటి సంఘటనలు చూసిన తర్వాత రాష్ట్రాలకు స్వయంత ప్రతిపత్తి వచ్చేనిట్లుగా అనిపించింది.

తీరా జరిగింది ఏమిటి? కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గ్రామాలకు విస్తరించకుండా కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితం అవ్వడం ఒక్కటే ఈ లాక్ డౌన్ సమయంలో జరిగిన మేలు. ఇప్పుడు ప్రధాని ఈ దేశానికి చెప్పాల్సిన జాగ్రత్తలు ఏవీ లేవు.

ఇప్పుడు ఆయన చెప్పాల్సింది ఒక్కటే కరోనా వైరస్ కు గురి అయిన వారికి ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా చికిత్స ఇలాగే కొనసాగిస్తారా? లేక బిల్లు పంపుతారా? కరోనా పాజిటీవ్ వచ్చిన వారికి ప్రభుత్వమే క్వారంటైన్, ఐసోలేషన్ సౌకర్యాలు కొనసాగిస్తుందా లేక చేతులు ఎత్తేస్తుందా? కరోనా తో మరణించిన వారికి ప్రభుత్వం పరిహారం ఇస్తుందా? ఇవ్వదా?

కరోనా (పూర్తిగా) అదుపు చేయడంలో దేశం మొత్తం తడబడినందున ఈ ప్రశ్నలు వేయాల్సి వస్తున్నది. ప్రధాని చెప్పాల్సింది 1. కరోనా పేషంట్లకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలి

2. క్వారంటైన్, ఐసోలేషన్ ఖర్చులు ప్రభుత్వమే భరించాలి. 3. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు కనీసం 5 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి. 4. ఇప్పటికే ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి  ఆరోగ్య బీమా పథకం బ్యాంకు ఎకౌంట్లతో, వయసుతో సంబంధం లేకుండా దేశంలో ఆధార్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికి అమలు చేయాలి.

ఈ పాయింట్లపై ప్రధాని క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే కరోనా పై పోరాటంలో పాక్షిక విజయమే సాధించాము కాబట్టి. ఇప్పడు దేశం కరోనాతో సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నది కాబట్టి.

Related posts

ఫాక్ట్ ఫైండింగ్: ధాన్యం అమ్మే రైతులకు సౌకర్యాలు లేవు

Satyam NEWS

జో బిడెన్ హత్యకు తెలుగువాడి కుట్ర

Satyam NEWS

30 గంటలుగా గుహలోనే: 7 గంటలుగా కొనసాగుతున్న సహాయక చర్యలు

Satyam NEWS

Leave a Comment