Slider నల్గొండ

ప్రణయ్‌ హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష

#pranaimurdercase

సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గత ఏడేళ్లుగా కేసు నడుస్తుండగా సుదీర్ఘ వాదనల అనంతరం తుది తీర్పు వెలువరించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ ని అమృత తండ్రి సుపారీ ఇచ్చి హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో A2 నిందితుడిగా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేశారు.

మిగిలిన నిందితులకు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. ప్రణయ్‌ హత్య కేసులో A1 నిందితుడు అమృత తండ్రి మారుతీరావు కాగా 2020లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. A2 సుభాష్‌ కుమార్‌ శర్మ, A3 అస్గర్‌అలీ, A4 బారీ, A5 కరీం, A6 శ్రవణ్‌ కుమార్, A7 శివ, A8 నిజాంలు నిందితులుగా ఉన్నారు. వీరిలో సుభాష్‌శర్మకు బెయిల్‌ రాకపోవడంతో ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు. అస్గల్‌ అలీ మరో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మిగిలిన వారందరూ బెయిల్‌పై బయటకు వచ్చారు. తాజాగా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.

సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష మిగిలిన నిందితులకు జీవితఖైదు విధించింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్‌ 14న సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడు. గర్భవతిగా ఉన్న భార్య అమృతను ఆస్పత్రికి తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా దుండగులు ప్రణయ్‌పై దాడి చేసి చంపేశారు. ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి, అమృత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు.

అప్పటి నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్‌ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం విచారణ పూర్తిచేసి ప్రణయ్ హత్యకేసుల్లో మెుత్తం ఎనిమిది మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించింది. 2019 జూన్‌ 12న చార్జిషీట్‌ దాఖలు చేయగా నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ సెషన్‌ కోర్టు విచారణ ప్రారంభించింది. రోజువారీగా మెుత్తం 102 మందిని విచారించింది. పోలీసులు సమర్పించిన చార్జిషీట్‌ నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌లతోపాటుగా సాక్షులను న్యాయస్థానం విచారించి తుది తీర్పును నేటికి రిజర్వు చేసింది.

ప్రణయ్‌ హత్యకేసులో ఏ1గా ఉన్న మారుతీ రావు 2020లో హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఏ2 నిందితుడు, బీహార్‌కు చెందిన సుభాష్‌శర్మకు తాజాగా కోర్టు ఉరిశిక్ష విధించింది. మారుతీ రావు బాబాయ్ శ్రవణ్ కుమార్ ఏ6గా ఉండగా.. అతడితో పాటు మిగిలిన ఐదుగురికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.

Related posts

ప్రచారంలో దూసుకుపోతున్న తీన్మార్ మల్లన్న

Satyam NEWS

శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల ఆన్‌లైన్ టికెట్ల కోటా విడుదల

Satyam NEWS

కన్నడ భక్తులతో నిండిన శ్రీశైల మహాక్షేత్రం

Satyam NEWS

Leave a Comment