22.2 C
Hyderabad
December 10, 2024 09: 53 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

#tirumala

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఈవో జె.శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు.

ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈవో ఆకాంక్షించారు. శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు నూతన పట్టువస్త్రాలు అలంకరించినట్టు తెలిపారు. అంత‌కుముందు ఆల‌యంలో మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు.

సాయంత్రం స్వామి, అమ్మ‌వార్లు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు. ఈ ఆస్థానంలో  శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయర్ స్వామి, ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు, ఆగమ సలహాదారు రామకృష్ణ దీక్షితులు, ముఖ్య అర్చకులు కిరణ్ స్వామి, అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సివీఎస్వో శ్రీధర్, డెప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, పారు పత్తేదార్ బాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Related posts

పోయిన ప్రాణం..”సర్వజన హాస్పిటల్ ” నిర్లక్ష్యమా..!

Satyam NEWS

అక్రమాయుధాల డీలర్ల అరెస్టు: భారీగా ఆయుధాల స్వాధీనం

Bhavani

జింబాబ్వే పై టీమిండియా ఘన విజయం

Satyam NEWS

Leave a Comment