38.2 C
Hyderabad
April 25, 2024 11: 49 AM
Slider గుంటూరు

ప్రత్యేక హోదా ఇవ్వని బిజెపిని ఓడించి బుద్ధి చెబుదాం

#navataramparty

ఆంధ్రప్రదేశ్ కు “ప్రత్యేక హోదా ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిన బిజెపికి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఎన్నికలలో కూడా పోటీ చేసే అర్హత లేదని నవతరం పార్టీ కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థి డా॥గోదా రమేష్ కుమార్ అన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం నల్లగార్లపాడులోని అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు నెరవేర్చకుండా తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు.

బిజెపి రాష్ట్రంలో ఎక్కడ పోటీచేసినా అక్కడ నవతరం పార్టీ కూడా పోటీచేసి బిజెపిని చిత్తుగా ఓడిస్తుందని ఆంధ్రలోని పెట్రోల్,డీజిల్ ధరలను జిఎస్టీ పరిధిలోకి తీసుకోకుండా పెట్రోల్,డీజిల్ ధరలను అత్యధిక రేట్లతో ఆంధ్రలో విక్రయించే విధంగా కుట్రపన్నిందని ఆయన అన్నారు. ముస్లీంలకు వ్యతిరేకంగా NRC లాంటి బిల్లులను ప్రవేశ పెట్టిందని, రైతులకు వ్యతిరేకంగా చట్టాలను ప్రవేశ పెట్టి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై కారును నడిపి రైతుల చావులకు కారణమైన బిజెపి కేంద్ర మంత్రి కుమారునిపై ప్రధాని నోరు మెదపలేదంటే దేశంలో ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన అన్నారు.

ఆంధ్రలో బిజెపి జనసేనతో చేయి కలిపి జతకట్టి బలపడాలని చూస్తుందని అందుకు వ్యతిరేకంగానే జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసుతో గతంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో పోటీచేసి బిజెపిని దెబ్బతీశామని రమేష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలో మరలా గాజుగ్లాసు గుర్తుతో పోటీ చేస్తున్నామని బిజెపికి బద్వేల్ లో ఆంధ్రుల పౌరుషమేమిటో మరోసారి చూపించి ఆంధ్రులను మోసం చేసిన బిజెపిని బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక సాక్షిగా మట్టికరిపిస్తామని ఆయన తెలిపారు.

ఈ నెల 20 నుంచి ప్రచారం ప్రారంభం

ఈనెల 20వ తేదీ నుండి బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విస్తృతంగా  ప్రచారం చేస్తామని ఆయన తెలిపారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా కోరుకునే వారంతా ప్రచారంలో పాల్గొంటామని నవతరం పార్టీ కోర్ కమిటీకి తెలిపారని ఆయన వెల్లడించారు.

మాకు గాజు గ్లాసు గుర్తు కంటే ఆంధ్రుల అభివృద్దే ముఖ్యమని ఆంధ్రకు ప్రత్యేక హోదా కల్పనే ధ్యేయమని తక్షణమే జనసేన నేతలు రెండు నాలుకల ధోరణి తక్షణమే మానుకొని విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని ఆయన హితవు పలికారు. బద్వేల్ లో దివంగత ఎమ్మెల్యే సతీమణిని గౌరవించి పోటీచేయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే అదే పార్టీకి చెందిన నేత నాదెండ్ల మనోహర్ బిజెపికి జనసేనపార్టీ మద్దతునిస్తుందని ఎలా ప్రకటిస్తారని రమేష్ కుమార్ ప్రశ్నించారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు బిజెపి ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని ఎలా చెబుతారని బిజెపి గెలుపు కొరకు బద్వేల్ కు ప్రధాని మోడీని తెచ్చుకున్నా  నవతరం పార్టీ బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించి తీరుతుందని ఈ విషయం బిజెపి నేతలు రాసి పెట్టుకోవాలని తెలిపారు.

Related posts

మోదీ…. పవను భేటీ… మధ్యలో ఫ్యాను ‘‘గాలి’’

Satyam NEWS

అధికారుల నిర్లక్ష్యంతో పోతున్న ప్రాణాలు

Satyam NEWS

నిజామాబాద్ చౌరాస్తాలో చెప్పుతో కొడతా

Satyam NEWS

Leave a Comment