29.2 C
Hyderabad
September 10, 2024 15: 57 PM
Slider మహబూబ్ నగర్

ఎంసిహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి

#wanaparthy

వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎంసిహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు 24 గంటలు సేవలు అందించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం  వనపర్తిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి  తనిఖీ చేశారు.  ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న పిల్లల వార్డు, ప్రసూతి వార్డు, శస్త్ర చికిత్సల వార్డు, ఎస్ ఎన్.సి. యు వార్డులను  పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న బెడ్ ల వివరాలు, వివిధ రకాలైన రిజిస్టర్లను పరిశీలించారు. రోజుకు ఎన్ని ఒ.పి లు నమోదు అవుతున్నాయి, ప్రసవాలు ఎన్ని, ఇతర ఆసుపత్రులకు రేఫర్ చేసిన రిజిస్టరును పరిశీలించారు. 24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రైవేటుకు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు అధికంగా జరిపించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్.యం.ఒ

డా. బంగారయ్య, గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ డా. అరుణ కుమారి, వైద్య సిబ్బంది  కలెక్టర్ వెంట ఉన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

శ్రీశైలం జల విద్యుత్ కేంద్ర ప్రమాదంపై సీబీఐ విచారణ జరపాలి

Satyam NEWS

విజయనగరం లో రహదారి భద్రతా ఉత్సవాలు

Satyam NEWS

ఎంపీడీవో మండల పరిషత్  క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment