39.2 C
Hyderabad
March 29, 2024 15: 53 PM
Slider జాతీయం

జ్ఞాన్‌వాపి కేసులో హిందువుల డిమాండ్ కు ఎదురుదెబ్బ

#gayanvapimasijid

వారణాసి లోని జ్ఞాన్‌వాపి మసీదు కేసులో హిందువులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జ్ఞాన్‌వాపి మసీదులో ఉన్నది శివలింగం అని, ఈ అంశాన్ని ధృవీకరించుకోవడానికి కార్బన్ డేటింగ్ విధానాన్ని చేపట్టాలని హిందువుల తరపు న్యాయవాదులు కోరారు. ఈ డిమాండ్ పై జిల్లా కోర్టు నేడు తన తీర్పును వెలువరించింది.

శివలింగం ఆకారానికి కార్బన్ డేటింగ్ చేయించాలని చేసిన డిమాండ్ ను జిల్లా జడ్జి అజయ్ కృష్ణ విశ్వేష్ తిరస్కరించారు. శివలింగం ఆకారానికి కార్బన్ డేటింగ్ చేయించాలనే పిటిషన్ పై జిల్లా కోర్టులో అక్టోబరు 12న విచారణ జరిగింది. విచారణ అనంతరం అక్టోబర్ 14వ తేదీని అంటే ఈరోజు ఆర్డర్‌ని ఆయన వెలువరించారు. అక్టోబర్ 12న విచారణ సందర్భంగా అంజుమన్ ఇనాజానియా తన పక్షం వాదనలను వినిపించగా, న్యాయవాది విష్ణుశంకర్ జైన్ కౌంటర్ రిప్లైలో హిందూ తరఫు వాదనలను సమర్పించారు.

మరో న్యాయవాది మన్ బహదూర్ సింగ్ ఎటువంటి సమర్పణలు చేయడానికి ముందుకు రాలేదు. దాంతో కోర్టు ఆర్డర్ కోసం అక్టోబర్ 14 కు వాయిదా వేశారు. ఈ కేసులో అంజుమన్‌ తరఫున న్యాయవాదులు ముంతాజ్‌ అహ్మద్‌, ఎఖ్లాక్‌ అహ్మద్‌లు మాట్లాడుతూ మే 16న జరిపిన సర్వేలో తేలిన వివరాలపై వచ్చిన అభ్యంతరం ఇంకా తొలగిపోలేదని, శృంగార గౌరీ పూజ, దర్శనం కోసమే ఈ కేసు దాఖలయ్యిందని తెలిపారు.

మే 17న, దొరికిన బొమ్మను రక్షించి, భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. శాస్త్రీయ పరిశోధనలో రసాయనాల వాడకం వల్ల ఆకారం క్షీణించవచ్చునని కూడా కోర్టుకు తెలిపారు. కార్బన్ డేటింగ్ జీవులపై చేస్తారు తప్ప రాళ్లపై చేయరని కూడా వారు వివరించారు. ఎందుకంటే రాయి కార్బన్‌కు అనుగుణంగా ఉండదని వారు తెలిపారు. అందుకోసమే కార్బన్ డేటింగ్ చేయవద్దని చెబుతున్నామని వారన్నారు.

హిందూ పక్షం న్యాయవాదులు హరిశంకర్ జైన్, విష్ణు జైన్, సుభాష్ నందన్ చతుర్వేది మరియు సుధీర్ త్రిపాఠి స్పందిస్తూ మసీదులోని నీటి కొలనులో నీటిని తొలగించినప్పుడు అక్కడ శివలింగం కనిపించిందని తెలిపారు. వెలికి వచ్చిన బొమ్మ శివలింగమా లేదా ఫౌంటెన్‌దా అనేది శాస్త్రీయ పరిశోధన ద్వారా మాత్రమే స్పష్టమవుతుందని వారు తెలిపారు.

అటువంటి పరిస్థితిలో, బొమ్మకు హాని కలిగించకుండా, హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా, పురావస్తు శాఖ నిపుణుల బృందం శాస్త్రీయ పరిశోధన చేయాలని వారు కోరారు. తద్వారా ఆ బొమ్మ శివలింగమా లేదా ఫౌంటైనా అని నిర్ణయించవచ్చునని వారు అభిప్రాయపడ్డారు. కోర్టుకు హాజరైన ఫిర్యాది రాఖీ సింగ్ తరపు న్యాయవాది మన్‌బహదూర్ సింగ్ ఈ విషయంలో వాదించడానికి నిరాకరించారు. కోర్టు, ఇరుపక్షాలను విన్న తర్వాత, ఈ ఆర్డర్ ను వెలువరించింది.

Related posts

మహా శివరాత్రి ప్రత్యేకం: మృత్యుదోషాలను నివారించే భోళా శంకరుడు

Satyam NEWS

ప్రతి ఒకరు కరోనా బూస్టర్ డోస్ తీసుకోవాలి

Satyam NEWS

ఫ్యాక్ట్ ఫైండింగ్:చంద్రబాబు మనుషుల ఇన్ సైడ్ ట్రేడింగ్

Satyam NEWS

Leave a Comment