37.2 C
Hyderabad
March 28, 2024 20: 44 PM
Slider నిజామాబాద్

పోడు భూములకు పట్టాలు పంచిపెట్టాలి

#demand for Patta

జుక్కల్ డివిజన్ లో సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు, ఎరువులు, విత్తనాలు, రైతు బందు ఇవ్వాలని కోరుతూ సి పి ఐ ఎం జుక్కల్ డివిజన్ కార్యదర్శి సురేష్ గొండ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం  విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

జుక్కల్ డివిజన్ లో సుమారు 6వేల మంది రైతు కుటుంబలైన ఎస్సి, ఎస్టీ, బి సి, మైనార్టీ వర్గాలకు చెందిన పేద కుటుంబల వారు భూములను సాగు చేస్తూ కుటుంబ లను పోషించుకుంటున్నారన్నారు. 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పోడు భూములు, బంజార భూములు, అస్సైన్డ్ భూములకు రెవిన్యూ, గిరిజన, అటవీ శాఖ అధికారులు కలిసి పట్టాలను ఇచ్చారు.

కాని ఇప్పటివరకు భూములకు సంబంధించిన సరిహద్దు లను చూపించలేదు. దీనితో రైతులు ఏ భూమిలో సాగు చేసుకోవలొ తెలియడం లేదు. అటవీ  అదికారులు నైజం కాలం నాటి మ్యాప్ ను తెచ్చి, రెవెన్యూ భూములను సైతం ఆటవికి  సంబంధించిన భూములు అని కంచే వేసి చేట్లు నాటుతున్నారు.

రైతులు తరతరాలుగా  పట్టాలు ఉన్న భూములను దాదాపు 50 సంవత్సరాల నుండి మహారాష్ట్ర లోని దెగ్లూర్ తాలూకాలో ఈ ప్రాంతం ఉమ్మడిగా ఉన్నప్పుడు పట్టాలు కల్గిన రైతులు కొందరు నేటికీ ఉన్నారు. ఇంకొందరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో నాల్గో విడత భూ పంపిణి కార్యక్రమం లో భాగంగా ఇచ్చిన పట్ట భూములు కల్గి ఉన్న రైతులు ఉన్నారు.

రెవిన్యూ, అటవీ అధికారులు ఆనాడు అభ్యoన్తరం తెలుపని ఉమ్మడి అధికారులు ప్రస్తుతం అటవీ భూములని అనడం సరైంది కాదన్నారు. కావున ఇప్పటికైనా రెవిన్యూ, అటవీ అధికారులు, జిల్లా కలెక్టర్ రైతుల పక్షాన నిలబడి పైన తెల్పిన భూములకు పట్టాలు ఇచ్చి రైతు కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సమస్య పరిష్కారం అయేంత వరకు ప్రతి రైతుకు రబి, ఖరీఫ్,  సీజన్ లో పోడు భూములకు ఎరువులు, విత్తనాలు, రైతు బందు ఇవ్వాలని సి పి ఐ ఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే దశల వారిగా ఉద్యమం తీవ్ర స్థాయిలో చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ కార్యక్రమం లో మోతిరాం, విట్టల్, మారుతీ రెడ్డి, కోలా నారాయణ, హరి గొండ, మహిబుబ్, టి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

40 మంది దళితబంధు లబ్దిదారులకు మంజూరు పత్రాల అందజేత

Satyam NEWS

రైతు సంఘం శ్రీకాకుళం జిల్లా 14 వ మహాసభలు జయప్రదం చేయండి

Satyam NEWS

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. కిలో పాలపొడి రూ.1,195

Sub Editor

Leave a Comment