28.7 C
Hyderabad
April 24, 2024 03: 53 AM
Slider నల్గొండ

అంగన్వాడి లకు భీమా సౌకర్యం కల్పించాలి

#AnganwadiWorkers

ప్రతి నిత్యం ప్రజలతో మమేకమవుతూ గర్భిణీలకు బాలింతలకు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ సామాజిక సేవ చేస్తున్నా అంగన్వాడి టీచర్లు ఆయాలు కరోనా బారిన పడుతున్నారని వారికి బీమా సౌకర్యం కల్పించి భరోసా ఇవ్వాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ) మండల అధ్యక్షురాలు కొలుకులపల్లి మనెమ్మ ప్రభుత్వాన్ని కోరారు.

ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు దేవరకొండ సిడిపిఓ సువర్ణకు సమస్యలతో కూడిన వినతి పత్రం శుక్రవారం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సైతం కరోనా రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీలకు రక్షణ పరికరాలు ఇవ్వాలని కోరారు.

రాష్ట్రంలో ఇప్పటికే పలువురు అంగన్వాడీ టీచర్లు కరోనాతో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్లో అమలు చేస్తున్న విధంగానే  అంగన్వాడీలకు కూడా 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. మరియు నూతన విద్యా విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంలో ఐసిడిఎస్ ప్రశ్నార్థకంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఐసిడిఎస్ పరిరక్షణ కోసం అందరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఐ సి డి ఎస్ కు నిధుల్లో కోత విధించారని ఇప్పుడు పూర్తిగా ఐసిడిఎస్ ను ఎత్తివేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. సంవత్సరాల తరబడి టి ఏ , డి ఏ లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.

లాక్ డౌన్లోడ్ కోత విధించిన జీతాలను వెంటనే విడుదల చేయాలని, సూపర్వైజర్ పోస్టుల భర్తీ చేయాలని, ఇతర పనులు అప్పజెప్పరా దని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమాల్లో అంగన్వాడి యూనియన్ ప్రాజెక్ట్ నాయకులు జీడికంటి వినోద జి. సునంద డి. సుమిత్ర వడ్త్యసుశీల తదితరులు పాల్గొన్నారు.

Related posts

విద్యుత్ బిల్లు కట్టలేను.. ఆర్థిక సహాయం చేయండి సారు

Satyam NEWS

టీడీపీ కండువా కప్పుకున్న వైసీపీ నేతలు

Satyam NEWS

గుండెలు పిండేసిన దళిత బాలిక ఆర్తనాదాలు

Satyam NEWS

Leave a Comment