దట్టమైన పొగమంచు శుక్రవారం ఉదయం ఉత్తర భారతదేశాన్ని ఆవరించింది. దాంతో దృశ్యమానత సున్నాకి తగ్గింది. అంటే ఎదురుగా ఉన్న ఏదీ కనిపించడం లేదు. ఉత్తర భారతదేశంలో గత కొన్ని వారాలుగా దట్టమైన పొగమంచు కారణంగా వందలాది విమానాలు మరియు రైళ్లు రద్దు చేశారు. ఇంకా ఆ పరిస్థితి కుదుటపడకపోగా మరింతా పొగమంచు పెరిగింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో తగ్గిన దృశ్యమానత కారణంగా సగటున 41 నిమిషాల పాటు 150 కంటే ఎక్కువ విమానాలు, దాదాపు 26 రైళ్లు ఆలస్యం అయ్యాయి.
ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) ఈ విషయాన్ని ధృవీకరించింది. శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా విమానాల బయలుదేరడంపై ప్రభావం చూపిందని తెలిపింది. అయినప్పటికీ పలు విమనాలు బయలుదేరగలవని DIAL ఆందోళన చెందుతున్న ప్రయాణీకులకు హామీ ఇచ్చింది. భారత వాతావరణ విభాగం (IMD) పంజాబ్, హర్యానా మరియు రాజస్థాన్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఒక మోస్తరు నుండి చాలా దట్టమైన పొగమంచు హెచ్చరికను జారీ చేసింది. చాలా మంది డ్రైవర్‌లు ఇతర డ్రైవర్‌లకు కనిపించేలా ప్రమాదాలను నివారించడానికి తమ హజార్డ్ లైట్‌లను ఆన్ చేశారు.
జాతీయ రాజధాని వాయు నాణ్యత సూచిక (AQI) ఉదయం 6 గంటల ప్రాంతంలో 408 వద్ద నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెబ్‌సైట్‌లోని డేటా ప్రకారం ఇది ‘తీవ్రమైన’ కేటగిరీకి పడిపోయింది. పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్‌లో నోయిడాలో AQI 328గా నమోదైంది. గ్రేటర్ నోయిడా AQI 295ని చూసింది. ఘజియాబాద్ కూడా 318కి చేరుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వాతావరణ శాఖ చెప్పినదాని ప్రకారం, ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 9.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శుక్రవారం రాజధానిలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది.