31.2 C
Hyderabad
April 19, 2024 04: 53 AM
Slider ముఖ్యంశాలు

ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

#BayOfBengal

ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ కారణంగా ఈశాన్య బంగాళాఖాతంలో రాగల రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు  రాష్ట్రంలో  అక్కడక్కడ భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉంది.

కృష్ణానది వరద ఉధృతి దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రాగల 3 రోజులపాటు  వాతావరణ వివరాలు:

సెప్టెంబర్ 19వ తేది :- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు.

మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు

సెప్టెంబర్ 20వ తేది:-  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి,  కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు.

మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం

సెప్టెంబర్ 21వ తేది:- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా,కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు.

మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం

Related posts

గ్లామరస్ ‘పాపతో పైలం’… ‘హంట్’లో ప్రత్యేక గీతం విడుదల

Satyam NEWS

మోటివేషన్ ట్రైనర్ గా బిచ్కుంద వాసి

Satyam NEWS

మహిళా కార్మికుల్ని వేధిస్తున్న సూపర్ వైజర్ కు దేహశుద్ధి

Satyam NEWS

Leave a Comment