20.7 C
Hyderabad
February 5, 2023 04: 00 AM
Slider ప్రత్యేకం

జేడ్పీ చైర్మన్ నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కు దక్కని చోటు…!

#ycp

ఏపీలో నాడు వైఎస్ హయాంలో చక్రం తిప్పిన నేతల హవా ప్రస్తుతం జగన్ ప్రభుత్వం లో తగ్గిందా…? వయసు మీరిన పెద్ద తలకాయలను జగన్ ప్రభుత్వం సూచన ప్రాయంగా పక్కన పెడుతోందా..? భవిష్యత్ రాజకీయ తరంపై ఇప్పటి నుంచే జగన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందా..?

ఈ ప్రశ్నలు మేము వెయ్యటం లేదు… అధికార పార్టీ నేతలు చేస్తున్న చర్యలే ఆ ప్రశ్నలు ఉత్పన్నం అయ్యేలా చేస్తున్నాయి. తాజాగా పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే… ఇటీవలే విజయనగరం ఎమ్మెల్యే కు కేబినెట్ హోదా అయిన డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టారు.. సీఎం జగన్. అందుకోసం ఎమ్మెల్యే కోలగట్ల తెగ ప్రయత్నాలు కూడా చేసారు. ముఖ్యంగా 2024లో తన బిడ్డ అయిన కోలగట్ల శ్రావణి కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఒకానొక సందర్భంలో పట్టు బట్టినట్లు సమాచారం.

అయితే కేబినెట్ హోదా…ఎమ్మెల్యే కోలగట్ల కు దక్కడంతో కాస్త ఉపశమనం కలిగి నట్లైంది.ఇదిలా ఉంటే రెండో సారి జగన్ మంత్రి వర్గ కూర్పులో తన తండ్రి వైఎస్సార్ ను అంటిపెట్టుకుని ఉండే కాపు కులానికి చెందిన బొత్స సత్యనారాయణ ను సీనియర్ మంత్రి హోదాలో ఉంచుతూ తన రెండో సారి కేబినెట్ కూర్పులో ఆయన స్థానం పదిలంగా నే ఉంచారు. అయితే జెడ్పీ ఎన్నికల్లో ఆయన బంధువైన చిన్న శీను ఉన్న పళంగా యూత్ అంటూ చక్రం తిప్పడం… పర్యవసనంగా జగన్ కు యువత ఓట్లు బాగా పడటంతో.. జేడ్పీ కిరీటాన్ని… సీఎం జగన్ ఆదేశానుసారం మంత్రి బొత్స దగ్గరుండి చిన్న శీనుకు ఇప్పించారు.

ఈ సందర్భంగా చిన్న శీను తన ఇమేజ్ కేడర్ ను పెంచుకుని…జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గా కూడా బాధ్యతలు వహించడంతో జగన్ పార్టీ… నాటి తరాన్ని పక్కన పెడుతోందన్న వాదన కూడా జిల్లాలో వినిపిస్తోంది. అందుకు తార్కాణమే…జిల్లా పరిషత్ సమావేశ పు హాలులో జేడ్పీ చైర్మన్ నిర్వహించిన మీడియా సమావేశంలో… ఆయన వెనుక ప్రత్యేకించి పత్రిక సమావేశం అని రాసి…ఆ పై న…కేవలం మంత్రి బొత్స, డిప్యూటీ సీఎం రాజన్న దొర ,విశాఖ కు చెందిన ఎస్వీ సుబ్బారెడ్డి బొమ్మలు ముద్రించి… స్థానిక ఎమ్మెల్యే, కేబినెట్ హోదా అయి ఉండి..డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ఫోటో లేకపోవడం చర్చ నడుస్తోంది.

అంతకు ముందు రోజే విజయనగరం ప్రదీప్ నగల్  లో మంత్రి బొత్స తమ్ముడు గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య నివాసంలో జిల్లా కు చెందిన మొత్తం ప్రజాప్రతినిధులు అంతా సమావేశమై…బీసీ గర్జన పై చర్చించినట్లు సమాచారం. అప్పుడే జిల్లా పరిషత్ చైర్మన్ బయటకు వచ్చి…రేపు జేడ్పీ మీడియా సమావేశం ఉంటుందని చెప్పడంలో ఆంతర్యం ఏంటి పార్టీ కి చెందిన సీనియర్ నేతలే చెప్పాలి.

అప్పుడు కూడా డిప్యూటీ స్పీకర్ అయిన కోలగట్ల ను మంత్రి బొత్స… చంటి ఇలా రా అని పిలిచారు కూడా.. స్థానిక మంత్రే…డిప్యూటీ స్పీకర్ కు అంతటి విలువ ఇచ్చినప్పుడు…జేడ్పీ లో ఆ బ్యానర్ పై డిప్యూటీ స్పీకర్ ఫోటో లేకపోవడం….సీనియర్లను పక్కన పెడుతున్నారని అని అనుకోవచ్చాని “సత్యం న్యూస్. నెట్.”..అంటోంది. ఏదైనా జిల్లా లో జరుగుతున్న ఈ మార్పు దేనికి సంకేతమో చూడాలని అంటోంది…”సత్యం న్యూస్. నెట్.”.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

సినీ దర్శకుడు వంశీ ‘పసలపూడి కథలు’పై పరిశోధనకు డాక్టరేట్

Satyam NEWS

మోడీకి లొంగిపోయిన జగన్, చంద్రబాబు

Satyam NEWS

పల్నాడు ప్రాంతంలో వైసీపీ,తేదేపా వర్గీయుల మధ్య ఘర్షణ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!