27.7 C
Hyderabad
March 29, 2024 01: 55 AM
Slider నల్గొండ

టిఆర్ఎస్ ప్రభుత్వంలో సహకార సంఘాలు అభివృద్ధి

#bollam

సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని కోదాడ శాసనసభ్యులు  బొల్లం మల్లయ్య యాదవ్, డీసీసీబీ జిల్లా చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు.  చిలుకూరు మండల కేంద్రంలో  చిలుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార యూనియన్  నూతన భవనo  ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడాతూ గత ప్రభుత్వాల హయాంలో సహకార సంఘాలు నిర్వీర్యమై ఉన్నాయన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహకార సంఘాలను చైతన్యపరిచి అనేక రకాలుగా అభివృద్ధి చేశామన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతో పాటు ఎరువులు పురుగుమందులు అందజేచేయడమే కాక రైతులు తమ పంటను నిల్వ చేసుకునేందుకు సహకార సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున లక్షల రూ.లు బడెజ్ట్  కేటాయిస్తున్నామని  అన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ కృషితో నేడు సహకార సంఘాలు రైతులకు అండగా నిలుస్తున్నా యన్నారు. 

సహకార సంఘాలను వాణిజ్యపరంగా కూడా అభివృద్ధి చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రైతులు సహకార సంఘం సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  అనంతరం గ్రామంలో  నియోజకవర్గ అభివృద్ధినిధుల నుండి నిర్మించిన సిసి రోడ్లను ఎమ్మెల్యే  ప్రారంభించారు. స్థలదాతలను ఎమ్మెల్యే  సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్  అలసగాని జనార్ధన్, డీసీసీబీ డైరెక్టర్లు కొండా సైదయ్య, వీరస్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, జెడ్పి కోఆప్షన్ సభ్యులు జానీ మియా, స్వతంత్ర సమరయోధులు దొడ్డ నారాయణరావు, సీఈఓ మదన్మోహన్, సొసైటీ చైర్మన్లు సైదులు, రమేష్, రైతు ఆసమన్వయ సమితి అధ్యక్షులు సురేష్, సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఎంపిటిసి రమణ నాగయ్య, మాజీ జెడ్పిటిసి భట్టు శివాజీ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కస్తూరి నరసయ్య, కడియాల వెంకటేశ్వర్లు, పాష, ప్రజా ప్రతినిధులు,  శాఖ అధికారులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పాలకవర్గ సభ్యులు, అభిమానులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు…

Related posts

ఒమిక్రాన్‌ తో రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ

Sub Editor

దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమే

Satyam NEWS

అనారోగ్యంతో కన్నుమూసిన సి ఐ టి యు నాయకుడు

Satyam NEWS

Leave a Comment