27.7 C
Hyderabad
April 20, 2024 02: 32 AM
Slider వరంగల్

మున్నూరు కాపు మహిళల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి

#munnurukapu

మున్నూరు కాపు మహిళల అభివృద్ధికి  ప్రణాళిక బద్ధంగా కృషిచేస్తున్నామని మున్నూరు కాపు మహిళా పరస్పర సహకార పొదుపు, పరపతి సంఘం లిమిటెడ్ ఉన్నత కార్యనిర్వహణ అధికారి సర్దార్ పుటం పురుషోత్తం రావు పటేల్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో గురువారం ములుగు నియోజకవర్గం మున్నురూ కాపు ముఖ్య నాయకుల సమావేశం కోఆర్డినేటర్ పిట్టల మధుసూదన్ పటేల్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మున్నూరు కాపు మహిళా పరస్పర సహకార పొదుపు, పరపతి సంఘం లీ టెడ్ ఉన్నత కార్యనిర్వాహణ అధికారి మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు సర్దార్ పుట్టం పురుషోత్తమా రావు పటేల్ హాజరై మాట్లాడుతూ కుటుంబ  అభివృద్ది కీ మహిళలల తోడ్పాటు అవసరమనీ, మహిళా మెలుకొ ఆర్ధిక స్వావలంబన సాధించు కో అనే నినాదం తో మున్నూరు కాపు మహిళా మాక్స్ సొసైటి ఎర్పాటు చేశామన్నారు. ఈ సొసైటి ద్వార చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆర్ధిక స్వావలంబన కు తోడ్పడుతామని ఆయన మున్నురూ కాపు ప్రతి మహిళా సభ్యురాలుగా చేరి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా ములుగు జడ్పిటిసి సకినాల భవాని పటేల్ మాట్లాడుతూ

మున్నూరు కాపుల మహిళ కోసం ఏర్పాటు చేసిన పొదుపు, పరపతి సంఘాన్ని మున్నూరు కాపు మహిళలందరూ సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు చింతనిప్పుల బిక్షపతి పటేల్, మండల కోఆర్డినేటర్ సిరికొండ బలరాం పటేల్, పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి బాణాల సుధాకర్ పటేల్, డైరెక్టర్ గండ్రత్ జయకర్, ఎడ్ల సంపత్ పటేల్, అనుముల సురేష్ పటేల్, సముద్రాల రఘోత్తం పటేల్, సుంకరి రవీందర్ పటేల్, చంద్ర ప్రకాష్ పటేల్, గండు రవీందర్ పటేల్, గాదె రాజు పటేల్, కాబట్టి ప్రభాకర్ పటేల్, మాలగానీ రాజు పటేల్, తోట అశోక్ పటేల్, గాదే ఆకాశ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంధుల స్కూల్లో పుట్టిన రోజు జరుపుకున్న కుడా చైర్మన్ మనుమరాలు

Satyam NEWS

హుదూద్ ఇల్లుకు కరెంట్ నీరు సౌకర్యం కల్పించాలని

Satyam NEWS

నాగర్ కర్నూల్ ఎస్ పి కార్యాలయంలో ప్రజావాణి

Bhavani

Leave a Comment