27.7 C
Hyderabad
April 18, 2024 10: 04 AM
Slider రంగారెడ్డి

సంక్షేమంతో బాటు ప్రాధాన్యతాక్రమంలో అభివృద్ధి పనులు

#sabitaindrareddy

గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడం కోసం అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల అభివృద్ధి పనులను తన కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో పురోగమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. కోవిడ్ కారణంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కొంత వరకు వేగం తగ్గినా, త్వరలోనే వాటిని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వంద శాతం ఇళ్ళకు రక్షిత మంచినీటిని అందిస్తున్నామని, నీటి సరఫరాకు సంబంధించి కనెక్షన్లు, లీకేజీలకు సంబంధించి చిన్నపాటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఆదేశించారు.

గతంలో నీటి ఎద్దడి ఏర్పడి దాహర్తి కోసం కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన పరిస్థితులను మనం చూశామని, అయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మంచినీటి సమస్య అంటూ లేకుండా పోయిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను కూడా సత్వరమే పరిష్కరించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యుత్ స్థంబాలు, వైర్లను ఏర్పాటు చేయడంతో పాటు నాణ్యమైన, నిరంతర విద్యుత్ ప్రసారం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఇటీవల ప్రతీ గ్రామ పంచాయితీలో నిర్మించిన స్మశానవాటికల్లో మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో అవసరమైన సిసి రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలను రూపొందించాలని, ప్రాధాన్యతాపూర్వకంగా వాటిని మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. గ్రామాల్లో ఉన్న పాఠశాలలకు ప్రహరీ గోడలను రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, త్వరలోనే మండలంలోని అన్ని పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు నిధులను సమకూర్చుతామని పేర్కొన్నారు.

మండలంలోని గ్రామాల మద్య లింక్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తహసిల్దార్ జ్యోతి, మండల అభివృద్ధి అధికారి, డిఎల్పీఓ, మిషన్ భగీరథ డీఈ ఆర్ అండ్ బి డిఈ, ట్రాన్స్కో డిఈ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఐక్యతను చాటానున్న క్రీడలు

Bhavani

మంచిర్యాల లో నీట మునిగిన పలు కాలనీలు

Satyam NEWS

రష్యా వ్యాక్సిన్ తో విపరీతంగా సైడ్ ఎఫెక్టులు

Satyam NEWS

Leave a Comment