32.7 C
Hyderabad
March 29, 2024 12: 25 PM
Slider హైదరాబాద్

అంబర్ పేట నియోజకవర్గంలో ప్రాధాన్యతాక్రమంలో అభివృద్ధి పనులు

#amberpetmla

హైదరాబాద్ లోని అంబర్ పేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే లక్ష్యంతో అంశాల వారీగా పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్  తెలిపారు. అంబర్ పేట డివిజన్ లో జరుగుతున్న నూతన ఎలక్ట్రికల్ పనులను కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ అందులో భాగంగా హైమత్ నగర్ నుండి పటేల్ నగర్ చౌరస్తా, గ్రీన్ ల్యాండ్ మీదుగా పటేల్ వాడా వరకు ఉన్న 1400 మీటర్ల 11 KV/AB కేబుల్ కవరింగ్ ను, అధికారులు వివిధ దశల్లో విడతల వారీగా 100 మీటర్ల పనులను ఒకసారి అమలు చేయనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా పనుల పురోగతిని ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాగ్ అంబర్ పేట డివిజన్, భరత్ నగర్ లోని వడ్డెర బస్తీ, రెడ్ బిల్డింగ్ లైన్ లో ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే అక్కడి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ బస్తీలో సైతం ఇళ్లను తగులుతూ వెళ్తున్న కరెంటు తీగల పైన 11KV/అబ్ కేబుల్ కవరింగ్ ఏర్పాటు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

ఏదైనా సమస్య ఉంటే దృష్టికి తీసుకురావాలని తప్పకుండా పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కన్స్ట్రక్షన్ ఏడీ శ్రీరాములు, సెంట్రల్ బ్రేక్ డౌన్ ఏడీ విజయ్ భాస్కర్, అంబర్ పేట ఏఈ రాఘవేందర్, గోల్నాక ఏఈ ప్రసాద్, కన్స్ట్రక్షన్ ఏఈ జగదీష్, వర్క్ ఇన్స్పెక్టర్లు రవి, దుర్గ, ఎస్ఎఫ్ఐ లు ఉమేష్, భాస్కర్, శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ అంబర్ పేట డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్, బాగ్ అంబర్ పేట డివిజన్ అధ్యక్షుడు చంద్ర మోహన్, పార్టీ నాయకులు శ్రీనివాసులు, అంజయ్య, ఆంజనేయులు, లింగారావు, మహేష్, గౌస్, మోశిన్, సాయిరాం, బస్తీ వాసులు కిషోర్, శ్రీధర్, మల్లిఖార్జున, నాగరాజు, మురళీ, ఎస్ఎస్ గుప్తా, చందు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అవినీతిలో చిక్కుకున్న ఐఏఎస్ అధికారి ఇంట్లో మరో ట్రాజెడీ

Satyam NEWS

వరంగల్ లో ఇన్స్ పెక్టర్ ల బదిలీలు

Sub Editor 2

కొన్న భూములు కాపాడుకోవటం కోసం…

Satyam NEWS

Leave a Comment