28.7 C
Hyderabad
April 24, 2024 04: 16 AM
Slider మహబూబ్ నగర్

అభివృద్ధి పనులకు భూమిపూజ శంకుస్థాపన

#KalwakurthyMLA

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్  శుక్రవారంభూమి పూజ నిర్వహించారు.

అదేవిధంగా అంతర్గత మురికి కాలువలు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. మునిసిపల్ కార్యాలయ గోదాము నిర్మాణానికి భూమి పూజ,1,2,3 వార్డులలో మురికినీటి ప్రధాన కాలువ నిర్మాణం,10 అడ్డు లో అంతర్గత మురికి కాలువ,11 వార్డులో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన భూమి పూజ  నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులకు అధికార పార్టీ పెద్ద పీట వేసిందని కొనియాడారు. కల్వకుర్తి పట్టణంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

అదేవిధంగా కల్వకుర్తి పురపాలక సంఘం చైర్మన్ ఎడమ సత్యం మాట్లాడుతూ పట్టణ పరిధిలో మునిసిపల్ కార్యాలయ వాహనాలు, సానిటైన్ పని ముట్లు, ఇంజనీర్ విభాగము సామగ్రి భద్రపరుచుటకు కార్యాలయం వెనక భాగంలో  నూతనంగా  16 లక్షలతో గోదాం నిర్మాణం, వార్డు నెం. 1,2,3 వార్డులో మురికి కాల్వలు లేక హస్త వ్యస్థంగా ఎక్కడపడితే అక్కడ మురుగునీరు చేరుకొని దోమలు  దురువాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

వడ్డెర బస్తి, కల్యాణ నగర్ , కోలు భావి మీదుగా అత్యవసరంగా మురికి నీటి ప్రధాన కాల్వ నిర్మాణం 35 లక్షలు వెచ్చిస్తున్నట్లు, వార్డు నెం10 అంతర్గత  కాలువ 10 లక్షలతో  వార్డు నెం 11 లో సిసి డ్రైనేజీ నిర్మాణం 10 లక్షలతో అభివృద్ధి పనులు చేయుటకు భూమి పూజ చేశామని తెలిపారు.

ఇట్టి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను కాంట్రాక్టర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పి.ఏ.సి.ఎస్ ఛైర్మన్ తలసాని జనార్దన్ రెడ్డి గారు, మార్కెట్ ఛైర్మెన్ బాలయ్య గారు, వైస్ చైర్మన్ షాహీద్ గారు, మాజీ చైర్మన్ రాచోటి శ్రీశైలం గారు, కౌన్సిలర్లు, బాలు నాయక్, నూనె యాదమ్మ శ్రీనివాస్, సూర్యప్రకాష్, ఉంలి హన్మానాయక్, రవీందర్, శ్రీనివాస్, లక్ష్మిరాంరెడ్డి, షాహీన్ తహెర్ అలీ, చైతన్య కిషోర్ రెడ్డి, తలసాని సౌజన్య, మంజుల మధు, ఏజస్, పద్మ చిన్న, సైదు బాబు, భోజి రెడ్డి, మనోహర్ రెడ్డి, ఖాలిల్ నాయకులు టి.ఆర్.ఎస్ మండల అధ్యక్షులు విజయ్ గౌడ్, సురేందర్ రాము నాయక్, వహీద్, చిన్న, కమిషనర్ జకీర్ హహ్మద్, ఏఈ శివ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

BJP Open letter: 10వ తేదీన కాణీపాకం వస్తావా రాచమల్లూ?

Satyam NEWS

రిటైర్ అయిన పోలీసుకు ఆత్మీయ వీడ్కోలు

Satyam NEWS

విద్యుత్ షాక్ తో ఇళ్లు కాలిపోయిన బాధితులకు ఆర్థిక సహాయం

Satyam NEWS

Leave a Comment