28.7 C
Hyderabad
April 20, 2024 09: 18 AM
Slider ఆదిలాబాద్

నిర్మల్ లో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

#NirmalCollector

జిల్లాలో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని నిర్మల్  జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పల్లె ప్రగతి నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో వేరువేరుగా నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

మండల, గ్రామాల వారీగా నిర్మాణంలోనున్న పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన స్మశాన వాటికలు, శెగ్రిగేషన్ షెడ్లు, రైతు వేదికల నిర్మాణ పనులను అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో వెంటనే పూర్తి చేయాలనీ ఆదేశించారు.

కూలీల సంఖ్యను పెంచి వెంటనే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు వేదిక ప్రాంగణంలో పచ్చదనం పెంపొందేలా విరివిగా మొక్కలు నాటాలన్నారు.

జోహార్ పూర్, జౌల, నిర్మల్, చించోలి, బైంసా మండలం చూచుంద్ లలో రైతు వేదికల నిర్మాణ పనులనూ వేగవంతం చేయాలనీ, ప్రతి రోజు నిర్మాణ పనులు జరిగేలా అధికారులు పనుల పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు.

నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పి సిఈఓ సుధీర్, డిఆర్డిఓ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజి ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ సుదర్శన్ రావు, ఎంపిడిఓ లు, వ్యవసాయశాఖ ఏవో లు, పంచాయతీ రాజ్ శాఖ ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

7న ఆదివాసీల భారత్ బంద్

Bhavani

ఇన్ పోలీస్ హాండ్స్:చిక్కిన జైష్-ఎ-మొహమ్మద్ కమాండర్

Satyam NEWS

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా: బండారి

Bhavani

Leave a Comment