38.2 C
Hyderabad
April 25, 2024 12: 25 PM
Slider హైదరాబాద్

వర్షం నీరు నిల్వకుండా పటిష్టమైన చర్యలు

#Mudraboina Srinivasarao

హైదరాబాద్ శివారులోని ఎల్ బి నగర్ ప్రాంతంలోని లింగోజిగూడా డివిజన్ పరిధిలో వర్షం నీరు నిల్వగుండా చర్యలు చేపట్టారు. సీ.ఏం.రోడ్డు పోయే దారిలో ఏం.ఎన్.ఆర్ చౌరస్తా నుండి నవోదయ కాలనీ వరకు చిన్నపాటి వర్షానికి రోడ్డుకు ఇరువైపులా వర్షాపు నీరు చేరుతున్నది.

ఈ నేపథ్యంలో నమిత ఎవరెస్టు, వైష్ణవి శిఖర అపార్టుమెంట్లు వాసులు, రోడ్డు మీద ప్రయాణించే వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక లింగోజిగూడా కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు అధికారులను పిలిపించి, యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

దానిలో భాగంగా రోడ్డు ప్రక్కన వర్షపునీరు నిల్వకుండా ఉండడం కోసం రోడ్డు పనులు ప్రారంభించారు. ముద్రబోయిన శ్రీనివాసరావు జీ.హెచ్.ఏం.సీ. డి.ఈ.జ్యోతి రెడ్డి, అపార్ట్మెంట్ వాసులు పనులను పరిశీలించారు.

వచ్చే వర్షానికి ఆ ప్రాంతంలో నీరు నిలువవుండకుండా రోడ్డుకు ఇరువైపులా ఎత్తుపల్లాలను సరిసమానంగా చూసుకొని పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

Related posts

జిల్లాలో మంత్రులు మీనమేషాలు లెక్క పెడుతున్నారు…!

Satyam NEWS

నీతి ఆయోగ్‌ సభ్యుడిగా అర్వింద్‌  వీర్మానీ

Murali Krishna

కరోనా కట్టడికి గిరిజన ప్రాంత ప్రజలు సహకరించాలి

Satyam NEWS

Leave a Comment