37.2 C
Hyderabad
April 19, 2024 12: 18 PM
Slider విజయనగరం

విద్య‌ల న‌గ‌రంలో ప్రైవేటు భాగ‌స్వామ్యంతో సుంద‌రీక‌ర‌ణ ప‌నులు

#kolagatlashravani

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతోనే ఏ అభివృద్ది ప‌ని అయినా ముంద‌డుగు పడుతుంద‌ని  విజ‌య‌న‌గ‌రం  ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని మ‌యూరీ జంక్ష‌న్ వ‌ద్ద ఆర్కే డీగ్రీ కాలేజీ స‌హ‌కారంతో స్టేష‌న్ వైపు వెళ్లే  మార్గంలో ప‌చ్చద‌నంతో నిర్మించిన సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌ను ఎమ్మెల్యే రిబ్బ‌న్ క‌ట్ చేసి ప్రారంభించారు. అనంత‌రం కాలేజీ ప్రిన్సిప‌ల్ విద్యార్దినీ,విద్యార్ధుల‌తో ఎమ్మెల్యే జ‌రిగిన అభివృద్ది ప‌నుల గురించి మాట్లాడారు. న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నికైన సంద‌ర్బంగా యాభై డివిజ‌న్ ల‌లో కార్పొరేట్ల‌ను ఉన్న  ఈ స‌మ‌యంలోనే న‌గ‌రాన్ని సుంద‌రంగా ఉంచే య‌త్నానికి న‌డుం బిగించామ‌న్నారు.

ఈ నేప‌ధ్యంలో ప‌లు  అభివృద్ది ప‌నుల‌కు శ్రీకారం చుట్టామ‌ని…అందులో భాగంగా  జ‌గ‌న‌న్న ప‌చ్చ‌తోర‌ణం కార్య‌క్ర‌మ‌ని…అందులో భాగంగా సుంద‌రీక‌ర‌ణ పనులను కూడా అదీ ప్రజ‌ల భాగ‌స్వామ్యంతోనే  జ‌రుగుతున్న‌ట్టు ఎమ్మెల్యే ఈసంద‌ర్బంగా చెప్పారు. అంత‌కుముందు డిప్యూటీ మేయ‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల నేతృత్వంలో న‌గ‌రం మరింత‌గా అభివృద్ది చేసేందుకు ప్ర‌తీ ఒక్క‌రూ కృషి చేయాల‌న్నారు.

జ‌గ‌న‌న్న ప‌చ్చ‌తోర‌ణలో  మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంతో పాటు జంక్ష‌న్ల సుందరీక‌ర‌ణ ప‌నులు…స్తానిక ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతోనే సాధ్య‌మ‌ని ఆమె అన్నారు. అక్క‌డ నుంచీ స‌మ‌పీంలోని  ఫుడ్ కోర్డ్ ను ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల సంద‌ర్శించారు. అక్క‌డ ప్రిజ్ లో ఉన్న అప్ప‌టిక‌ప్ప‌డు ఆహార పొట్లాల‌ను…అన్నార్తుల‌కు పంపిణీ చేసారు. ఈ కార్య‌క్ర‌మంలో హోట‌ల్ మ‌యూరా అధినేత తోపాటు ఇద్ద‌రు వ్యాపార వేత్త‌లు ఆహార పోట్లాల‌ను  పంపిణీ చేసారు.ఈ కార్య‌క్ర‌మంలో 33వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ రంగా పాల్గొన్నారు.

Related posts

ప్రతి ఉపాధ్యాయుడు ఇంగ్లీష్ శిక్షణ పొందాలి

Satyam NEWS

గణనాధుని పూజలో కార్పొరేటర్  రాగం నాగేందర్ యాదవ్

Satyam NEWS

హక్కుల కమిషన్ కు వచ్చే బాధితుల సమస్యలు సత్వర పరిష్కారం

Satyam NEWS

Leave a Comment