32.2 C
Hyderabad
April 20, 2024 19: 43 PM
Slider కృష్ణ

మంత్రి కొడాలి నాని పై మాజీ మంత్రి దేవినేని ఉమ ఫిర్యాదు

#DevineniUmameheswararao

మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత దేవినేని ఉమ తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రి కొడాలి నాని తనను లారీతో తొక్కించి చంపుతామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీఎం జగన్ ప్రేరణతో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు కృష్ణప్రసాద్, వంశీ తనను బెదిరిస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. లారీతో తొక్కిస్తా అని మంత్రి నాని అనడం ఏంటి? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? మంత్రి కొడాలి నాని మాటల వెనుక సీఎం జగన్ ఉన్నారని ఆయన అన్నారు.

కొడాలి నానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. చంద్రబాబుపై, దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత బచ్చుల అర్జునుడు విమర్శించారు.

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. వైసీపీ అరాచక పాలనపై ప్రజల తిరుగుబాటు తప్పదన్నారు.

Related posts

జామా మసీదులో మహిళల ప్రవేశానికి ఓకే

Satyam NEWS

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టేందుకు ‘దేశం’ వ్యూహం

Satyam NEWS

తెలంగాణ లో దళితులపై పెరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు

Satyam NEWS

Leave a Comment