వరుసగా సెలవులు రావడం తో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రద్దీ అధికంగా ఉండటం తో సోమవారం అర్ధరాత్రి వరకు భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ధర్మగుండం గేట్లను ఆలయ అధికారులు మూసివేశారు. కోడె మొక్కుల క్యూలైన్ కాంప్లెక్స్‌లు భక్తులతో నిండిపోయాయి.
భక్తులకు మహాలఘు దర్శనం అమలు చేస్తున్నారు. మేడారం జాతర సందర్భంగా రాజన్న దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని సమ్మక-సారలమ్మను దర్శించుకోవడం అనవాయితీ. దీంతో వేములవాడకు భక్తజనం పోటెత్తింది.