39.2 C
Hyderabad
March 29, 2024 15: 51 PM
Slider విజయనగరం

డీజీపీ వ్యాఖ్య‌ల‌ను ఖండించిన ఉత్త‌రాంద్ర బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

#MLCMadhav

రాష్ట్రంలో విగ్ర‌హాల విద్వంసం కాండ చినికిచినికి గాలివానలా అవుతోంది. అన్య‌మ‌త‌స్తులు అంశం ఎక్క‌డా ప్ర‌స్తావించ‌కుండా రాజ‌కీయ రంగు అంటుకుంటోంది.

సాక్షాత్ పోలీస్ శాఖ అధిప‌తి…విగ్ర‌హాల విధ్వంస కాండలో ప్ర‌తిప‌క్ష టీడీపీ,బీజేపీలకు చెందిన నేత‌ల హ‌స్తం ఉంద‌ని నిర్దార‌ణ అయ్యిందని…కొంత‌మందిని అరెస్ట్ చేసామ‌ని స్వ‌యంగా ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతం స‌వాంగ్ మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ చెప్ప‌డం బీజేపీకి ఆగ్ర‌హం తెప్పించింది.

ఈ మేర‌కు ఉత్త‌రాంధ్ర బీజేపీ ఎమ్మెల్సీ మాధ‌వ్ విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్టీ కార్యాల‌యంలో డీజీపీ వ్యాఖ్య‌లను ఖండించారు.

ఆలయ ఘటనల వెనుక 17 మంది టీడీపీ నేతలు, నలుగురు బీజేపీ నేతల హస్తం ఉంద‌ని….15  మందిని అరెస్ట్ చేసామ‌ని..ఆరుగురు పరారీలో ఉన్నార‌ని డీజీపీ పేర్కొన‌డం బీజేపీకి ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. అంతేనా…రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, గుంటూరు‌, క‌డ‌ప‌, క‌ర్నూలు, ప్ర‌కాశం, విశాఖ‌, శ్రీ‌కాకుళం జిల్లాల్లో జ‌రిగిన 9 ఘ‌ట‌న‌ల్లో టీడీపీ, బీజేపీల‌కు చెందిన 21 మంది పాత్ర ఉంద‌ని పోలీసులు తేల్చేశారు కూడా.

ఈ వ్యాఖ్య‌ల‌ను ఉత్త‌రాంధ్ర ఎమ్మెల్సీ మాధ‌వ్ తీవ్రంగా ఖండించారు.అధికార  పార్టీ  మ‌త ప్రాతిదిక‌న పాల‌న సాగిస్తున్న‌ట్టు విశిద‌మ‌వుతోంద‌న్నారు.

కావాల‌నే గుడుల‌పై దాడులు చేయించి ద‌గ్గ‌రుండీ విగ్రహాల ధ్వంసం చేయించి…తిరిగి  ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌బ‌బు కాదన్నారు.

దేవాలయాలలో విగ్రహ ద్వంసానికి కారకులెవరు..? ప్రభుత్వ మే చెప్పాలి

ఏపీలో వరుసగా జరుగుతున్న విగ్రహాల ద్వంసం పై రాష్ట్ర ప్రభుత్వమే వివరణ ఇవ్వాలని ఉడిపి పీఠాధిపతి పేజావర్ స్వామి అన్నారు.

రామతీర్థం నీలాచలం కొండ ప్రాంతాన్ని సందర్శించిన అనంతపురం విజయనగరం లో శ్రీ వెంకటేశ్వర టెంపుల్ లో మీడియా తో మాట్లాడారు.

విగ్రహాల ద్వంసం పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసాభని ఆ లేఖను మీడియా కు చూపించారు.

Related posts

నూతన వధూవరులను ఆశీర్వదించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

రైతు వేదికలకు నిధులు రేపటి లోగా విడుదల చేయాలి

Satyam NEWS

సంక్రాంతి సందర్భంగా బ్రాహ్మణ సంక్షేమ సంఘం క్రికెట్ పోటీలు..!

Satyam NEWS

Leave a Comment