31.2 C
Hyderabad
April 19, 2024 04: 44 AM
Slider వరంగల్

నేరాలకు శిక్షలు పడే విధంగా దర్యాప్తు సాగాలి

#mulugu SP

తెలంగాణ డిజిపి ఎం మహేందర్ రెడ్డి నేడు అన్ని జిల్లాల కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ములుగు జిల్లా పోలీస్ కార్యాలయం నుండి పాల్గొన్నారు.

ఈ నేర సమీక్ష సమావేశంలో డిజిపి మాట్లాడుతూ కేసులలో నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు నమోదైన కేసులలో దర్యాప్తు ఏవిధంగా కొనసాగుతుందో పరిశీలించాలని అన్నారు.

పోలీస్ స్టేషన్ల లలో వర్టికల్ సిస్టం ని,5s సిస్టం అమలు తీరును పటిష్టం చేయాలని ఆదేశించారు. ఆర్ ఐ స్టోర్స్  నుండి ఆర్టికల్స్ నీ తక్షణమే సిబ్బందికి పంపిణీ చేయాలన్నారు.

పోలీస్ స్టేషన్లలో ఎవరికీ చెందకుండా వదిలివేయబడిన వాహనాలను వేలం పద్ధతి ద్వారా అమ్మి వేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో స్టేషన్ బెయిల్ ఇచ్చే విధానాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ములుగు ఏ ఎస్ పి పోతరాజు సాయి చైతన్య, ఏఎస్పీ చెన్నూరి రూపేష్, ఎస్ బి ఇన్స్పెక్టర్ రెహమాన్,ఆర్ ఐ స్వామి , డిసిఆర్బి ఎస్ ఐ చైతన్య చందర్ పాల్గొన్నారు.

Related posts

జిల్లా స్థాయి ఖోఖోలో ఐగ్రో విద్యార్ధుల ప్రతిభ

Satyam NEWS

భారత రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులు

Satyam NEWS

‘నవీన విద్యావిధానం’ విశ్వమంతటికీ దారిచూపాలి

Satyam NEWS

Leave a Comment