36.2 C
Hyderabad
April 24, 2024 19: 44 PM
Slider ఆధ్యాత్మికం

ఒంటిమిట్టలో ధ్వజావరోహాణం పూర్ణాహుతి పూర్తి

Vontimitta 101

కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి ధ్వజావరోహాణం నిర్వ హించారు. వేదపండితులు ధ్వజస్తంభం వద్దకు వేంచేశారు. అక్కడ గరుడునికి వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపఠనం చేశారు.

ధ్వజస్తంభం వద్ద ఉన్న గరుడ పటాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా కిందికి దించారు. తర్వాత ఆ పటాన్ని ధ్వజా వరోహణానికి వచ్చిన స్వామివారి పాదల చెంత ఉంచారు. ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు శుక్రవారం నిర్వహించిన ధ్వజా వరోహణంతో ముగిశాయి.

ఈ వేడుకలను టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ల్లో భాగంగా పదో రోజు ఈ కార్యక్రమంను ఆలయ ప్రాంగణంలో వేదపండితులు, టీటీడీ అధికారులు మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా నిర్వహించారు.

Related posts

కరోనాతో ములుగులో హిందీ ఉపాధ్యాయుడు మృతి

Satyam NEWS

ఆసక్తి రేపుతున్న కొత్త జంట

Satyam NEWS

వృత్తి దారులను మోసగిస్తున్న కెసిఆర్

Bhavani

Leave a Comment