27 C
Hyderabad
September 22, 2020 12: 13 PM
Slider నల్గొండ

ధరణి టెక్నికల్ స్టాఫ్ కి ఉద్యోగ భద్రత కల్పించాలి

#DharaniEmployees

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన రెవెన్యూ చట్టంలో ధరణి ప్రాజెక్ట్ టెక్నికల్ స్టాఫ్ కి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

వేతనాలు పెంచడం, క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ బుధవారం హైదరాబాద్ లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్(TRESA) ప్రెసిడెంట్ వంగ రవీందర్ రెడ్డి, సెక్రటరీ గౌతమ్ కుమార్ కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన టెక్నికల్ స్టాప్ సమావేశం అయ్యారు.

వారితో పాటు సూర్యాపేట జిల్లా నుండి గండు చిన్నా గౌడ్, లింగరాజు, గురు ప్రసాద్, సంపత్ లు కూడా వినతిపత్రాన్ని అందించారు.

ఈ సందర్భంగా గడిచిన రెండు సంవత్సరాల నాలుగు నెలల నుండి రెవెన్యూ ఉద్యోగులతో పాటు సమానంగా రేయింబవళ్ళు పని చేస్తున్నామని అన్నారు.

అన్ని వేళల రెవెన్యూ శాఖకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం చేపట్టిన ILRMS (ధరణి) వెబ్ సైట్ లో మండల,డివిజన్, జిల్లా స్థాయి సర్వీసులను (32 సర్వీసులు) చేస్తూ అప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు.

విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వ ఆదేశానుసారం పనిచేస్తున్నామని, కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయంలో దాదాపు 696 మంది టెక్నికల్ స్టాఫ్ కి ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచి క్రమబద్ధీకరణ చేయాలని కోరారు.  

Related posts

రెబెల్ వాయిస్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుపైనే అభ్యంతరం

Satyam NEWS

సోషల్ మీడియా చక్రబంధంలో ఇరుక్కున్న కేటీఆర్

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!