36.2 C
Hyderabad
April 18, 2024 13: 57 PM
Slider నల్గొండ

ధరణి పోర్టల్ తక్షణమే రద్దు చేయాలి

నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ధర్నా,నిరసన తెలియజేసి ఆర్డీవో కి మెమొరాండం అందజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి యరగని నాగన్న గౌడ్, సీనియర్ నాయకులు సాములు శివారెడ్డి, పి.సి.సి సభ్యుడు దొంగరి వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, సీనియర్ నాయకుడు బాచిమంచి గిరిబాబు కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్,గరిడేపల్లి, మేళ్లచెరువు చింతలపాలెం,మఠంపల్లి మండల అధ్యక్షులు,వర్కింగ్ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,భూక్య మంజు నాయక్,నందిరెడ్డి ఇంద్రారెడ్డి, పట్టణ రైతు సంఘం అధ్యక్షుడు పులిచింతల అంజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది సంవత్సరాల నుండి కెసిఆర్ ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూపుతుందని,ఎన్నికలలో ఇచ్చిన వాగ్ధానం లక్ష రూపాయల ఋణమాఫీని ఏకకాలంలో అమలు చేయకుండా రైతులను మోసం చేస్తుందని అన్నారు. రైతులకు లాభం చేకూరుస్తుందని తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ప్రతి చిన్న కారు రైతుకు అనేక సమస్యలు కొనితెచ్చిపెడుతుందని,ధరణి పోర్టల్ ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో రైతులకు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాలకు పంట నష్టపరిహారం అందించడం లేదని, రైతుబంధు చిన్న కారు రైతుల కన్నా బడా భూ స్వాములకే మేలు జరుగుతుందని, రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర చెల్లిస్తే ఏ రైతు కూడా రైతు బంధు కోసం ఎదురు చూడడని అన్నారు.రైతుబంధు పేరుతో 5,000 రూపాయలు చెల్లిస్తూ పంటలకు అవసరమైనటువంటి ఎరువులు,పెస్టిసైడ్స్ ధరలను తెలంగాణ ప్రభుత్వం విపరీతంగా పెంచారని,గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల చాలామంది కౌలు రైతులు బలవన్మరణాలు చేసుకునే పరిస్థితులు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయని అన్నారు.కెసిఆర్ ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకొస్తున్నారని,కెసిఆర్ కి ఓట్లు తప్ప ప్రజల యొక్క బాగోగులు అవసరం లేదని,కెసిఆర్ చేస్తున్నటువంటి మోసాలను తెలంగాణ ప్రజానికం, రైతాంగం నిరుద్యోగులు,మహిళలు నిశితంగా గమనిస్తున్నారని,ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ తెలియజేసిన సమస్యల మీద స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి కెసిఆర్ ని గద్దె దింపటం ఖాయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి వీరబాబు,ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య,గొట్టేముక్కుల రాములు,ఎంపిటిసి సభ్యులు బాల్దూరి సందీప్,మచ్చ వెంకటేశ్వర్లు,పరమేష్, మున్సిపల్ కౌన్సిలర్ కోతిసంపత్ రెడ్డి, కాల్వపల్లి తండా సర్పంచ్ సక్రు నాయక్, జిల్లా కార్యదర్శి చాందిమియా,మహిళా నాయకురాలు ఇంటి అచ్చమ్మ, బొప్పని లక్ష్మి,మఠంపల్లి మండల మైనార్టీ నాయకుడు నాగులు మీరా,ఐ ఎన్ టి యు సి నాయకులు బెల్లంకొండ గురవయ్య గౌడ్,మేళ్ళచెరువు ముక్కంటి, చింతకాయల రాము,కస్తాల రవీందర్,ఎస్సీ సెల్ జిల్లా నాయకులు అంజనపల్లి సుదర్శన్,హుజూర్ నగర్ వార్డు కమిటీల అధ్యక్షులు ముషం సత్యనారాయణ, సమ్మెట సుబ్బరాజు,కంకణాల పుల్లయ్య, ఇట్టిమల్ల బెంజిమెన్,పోతుల జ్ఞానయ్య, దాసరి పున్నయ్య,బంటు సైదులు, దొంతగాని జగన్,తేప్పని యలమంద,షేక్ ఫరీద్,కందుకూరి రాము,గడ్డం అంజి, మాజీ ఎంపిపి ఇరిగాల లక్ష్మీ, రామకృష్ణారెడ్డి,రైతు సంఘం నాయకులు భోగాల పిచ్చిరెడ్డి,వల్లపుదాసు దుర్గయ్య గౌడ్,రౌతు అంతయ్య,అన్నపురెడ్డి వెంకటరెడ్డి,ఎ.గోవిందరెడ్డి,ఎం.వెంకటేశ్వర రెడ్డి,జనిగల వెంకటేశ్వర్లు,పి.పుల్లారెడ్డి,ఎ. చిన్నపురెడ్డి,జి.వెంకటేశ్వర్లు,రవీందర్, కుక్కడపు వీరబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

ఉత్తరాఖండ్ ఎమ్మెల్యేల్లో కొత్త కలవరం

Sub Editor

త్రికోణం… మూవీ ప్రారంభోత్సవం

Satyam NEWS

కిసాన్ క్రెడిట్ కార్డుతో అధిక వడ్డీ నుంచి ఉపశమనం

Satyam NEWS

Leave a Comment