30.7 C
Hyderabad
April 24, 2024 02: 02 AM
Slider ఖమ్మం

ఖరీదైన వైద్య పరీక్షలు కూడా ఇక తెలంగాణలో ఫ్రీ

#minister puvvada

వైద్యంలో అత్యంత కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షా (డయాగ్నోసిస్) కేంద్రాల ఏర్పాటుతో తెలంగాణలో వైద్య రంగం మరో ముందడుగు వేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని, శాంపిల్స్ తరలించే వాహనాలను ఆయన నేడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేందుకు, అన్నిరకాల వైద్యసేవలను మరింతగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా పలు ఇతర ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచామని తెలిపారు.

ప్రజలకు ఉచిత  వైద్యకోసం  ఇప్పటికే పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని, గత పాలనలో ఆగమైన వైద్య రంగాన్ని అనతికాలంలోనే ప్రభుత్వం పునరుజ్జీవింప చేసిందన్నారు. సామాన్యుడికి వైద్యాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చి ఆరోగ్య తెలంగాణను తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరో ముందడుగు వేసిందన్నారు. వైద్యంలో అత్యంత కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షా (డయాగ్నోసిస్) కేంద్రాలను తెలంగాణలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం రాష్ట్ర వైద్య చరిత్రలో గొప్ప సందర్భమని తెలిపారు.

ప్రజలకు వైద్యం రాను రాను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిందని, పేదలకు జబ్బు చేస్తే నయం చేసుకుందానికి ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని, రోగం కంటే రోగ పరీక్షల ఖరీదు మరీ ఎక్కువయిందన్నారు. రోగ నిర్ధారణ జరగాలంటే రక్తం మూత్రం వంటి పరీక్షలు జరపాల్సిందేన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రతి మనిషికి బీపీ, షుగర్లు ఎక్కువయ్యాయని వాటి పరీక్ష చేయించుకోవడానికి, గుండె, కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, క్యాన్సరు, థైరాయిడ్ తదితర జబ్బులకు సంబంధించిన పరీక్షలు నిత్యం సామాన్యులకూ పేదలకు అవసరంగా మారాయన్నారు.

ఈ మధ్యకాలంలో కరోనా వ్యాధి ఒకటి కొత్తగా జబ్బుల లిస్టులో వచ్చి చేరి దానికీ పలు రకాల పరీక్షలు చేస్తున్నారని, ప్రభుత్వ దవాఖానాల్లో డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తడు కానీ పరీక్ష కోసం ఎక్కడికో ప్రయివేట్ సెంటర్లకు పోయి వేలకు వేలు ఖర్చు చేసి పరీక్షలు చేయించుకోవాల్సి దుస్థితి నెలకొందన్నారు.

దీనివల్ల పేదలపై విపరీతమైన ఆర్ధిక భారం పడుతున్నదని, కరోనా నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు ఇంకా కరోనా చికిత్స కోసం అవసరమైన ఇతర పరీక్షల కోసం కూడా పేదలు నానా అవస్థలు పడుతున్నారన్నారు.

ఈ నేపథ్యంలో.. వైద్యాన్ని అందిచడమంటే కేవలం డాక్టర్లు మందులు సూదులు మాత్రమే కాదనీ, పరీక్షలు కూడా అత్యంత ప్రధాన్యత అంశంగా ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజల పట్ల ఉన్న ప్రేమను చాటుతుందన్నారు.

వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పు

ఇటువంటి ఏర్పాటు ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మకమైనదని, పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తున్నదనేదానికి నిదర్శనమన్నారు.

నేడు ప్రారంభించిన డయాగ్నోసిస్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, అందులో కరోనా పరీక్షలతో పాటుగా… రక్త పరీక్ష, మూత్ర పరీక్ష సహా బీపీ సుగర్ గుండె జబ్బులు, బొక్కల జబ్బులు, లివర్, కిడ్నీ,థైరాయిడ్ వంటి వాటికి సంబంధించిన ఎక్స్ రే బయోకెమిస్ట్రీ పాథాలజీ కి సంబంధించిన పలు పరీక్షలు వుంటాయని వెల్లడించారు.

సాధారణ  పరీక్షలే కాకుండా, అత్యంత అరుదుగా చేసే ఖరీదుతో కూడుకున్న ప్రత్యేక పరీక్షలను కూడా పూర్తిగా ఉచితంగా చేసి తక్షణమే రిపోర్టులిస్తారని తెలిపారు. నిర్దారించిన రిపోర్టులను ఆయా రోగుల సెల్ ఫోన్లకు  మెసీజీల రూపంలో పంపించే ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేసిందన్నారు. 

ఈ కేంద్రాల్లో పరీక్షలకోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పరీక్షా యంత్రాలన్నీ అత్యంత అధునిక సాంకేతికతతో, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో, ఖరీదైన యంత్రాలని వినియోగించనున్నారని అన్నారు.

రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా వీటిని ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాగ్నసిస్ కేంద్రాల్లో.. ‘‘  ఫుల్లీ (fully) ఆటోమేటిక్ క్లినికల్ కెమిస్ట్రీ అనలైజర్’’., ‘‘ ఫుల్లీ ఆటోమేటిక్ ఇమ్యునో అస్సే అనలైజర్’’., ‘‘ ఫైవ్ పార్ట్స్ సెల్ కౌంటర్’’ ‘‘ఎలీసా రీడర్ అండ్ వాషర్’’., ‘‘ ఫుల్లీ ఆటోమేటిక్ యూరిన్ అనలైజర్’’వంటి అత్యాధునిక సాంకేతిక తో కూడిన రోగ నిర్ధారణ పరీక్షా యంత్రాలున్నాయని వివరించారు.

వీటితో పాటుగా ఈసీజీ, టుడీ ఈకో, ఆల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్ రే వంటి ఇమేజింగ్ పరీక్షా యంత్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారని, ఇవి అత్యంత సామర్ధ్యంతో కూడుకుని అత్యంత వేగంగా రిపోర్టులందిస్తాయన్నరు. పైన తెలిపిన పరీక్షల తీరును అనుసరించి వొక్కో యంత్రం, గంటకు 400 నుంచి 800 రిపోర్టులను అత్యంత  ఖఛ్చితత్వంతో  అందచేస్తాయని వైద్యాధికారలు తెలిపారని అన్నారు,

తక్కువ సమయంలోనే రోగ నిర్ధారణ పరీక్షలు

కోట్లాది రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన అత్యాధునిక యంత్రాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మంది పేదలకు రోగ నిర్ధారణలు చేసి, వైద్య సేవలందించగలుగుతామని వివరించారు. వీటితో పాటు, అందుబాటులో లేని చోట్ల సీటీ స్కానింగ్ యంత్రాలను కూడా దశల వారీగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాల్లో చికిత్స చేయించుకున్న రోగికి  స్వయంగా ఈ డయాగ్నోసిస్ కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితులలో సంబంధిత వైద్యుని సిఫారసు మేరకు,  రోగ నిర్ధారణ పరీక్షల కోసం పరీక్షా శాంపిల్ ను ప్రభుత్వమే దగ్గరలో వున్న కేంద్రానికి పంపి పరీక్షలు నిర్వహించి సత్వరమే రిపోర్టులు ఇచ్చే విధంగా డయాగ్నోసిస్ కేంద్రాల్లో పేదల సౌకర్యార్థం ప్రభుత్వం వాహనాలను ఏర్పాట్లు చేసిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

మధిరలో 100 పథకాలు, సతుపల్లిలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిన్న కాబినెట్ తీర్మానించింది అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన మెడికల్ కళాశాలను పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రానున్న రోజుల్లో వైద్య రంగంలోని అన్ని సమస్యలను ఆదిగమిస్తామన్నారు.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కేంద్రాల్లో డయాగ్నొస్టిక్ సెంటర్ లను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, DM&HO మాలతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు.

Related posts

నిశ్శబ్దంలోకి జారుకున్న హైదరాబాద్ పాత బస్తీ ప్రాంతం

Satyam NEWS

ఛాలెంజ్: అక్రమ కట్టడాలు కూలగొట్టి నిజాయితీ నిరూపించుకో

Satyam NEWS

నిజామాబాద్ రోటరీ క్లబ్ సేవలు ప్రశంసనీయం

Satyam NEWS

Leave a Comment