31.2 C
Hyderabad
January 21, 2025 15: 15 PM
Slider ఆదిలాబాద్

ఆపదలో రక్షించిన డయల్ 100

police saving

ఆదివారం ఉదయం 2 గంటలకు హైదరాబాద్ నుండి నాగపూర్ కి వెళ్తున్న కారు మహబూబ్ ఘాట్ రెండవ సెక్షన్ లో పొగ మంచు ఎక్కువ రావడంతో దారి కనిపించక, అదుపు తప్పి లోయలో పడిపోయింది.

డయల్ 100 ద్వారా నిర్మల్ కంట్రోల్ రూమ్ కి సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తం అయిన నిర్మల్ డిసిఆర్బి ఇన్స్పెక్టర్ గోపినాథ్, శ్రీకాంత్ ఎస్ఐ సారంగాపూర్ ఇద్దరు వెళ్లి వారిని లోయలో గుర్తించికారు లో ఉన్నటువంటి రాధా కృష్ణ మరియు ఆయన భార్య, కుమారుడిని ముగ్గురిని కాపాడారు. ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. హైదరాబాద్ సరూర్ నగర్ కి చెందిన వారిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి కి చికిత్స నిమిత్తం తరలించారు.ఇన్స్పెక్టర్ గోపీనాథ్, శ్రీకాంత్ ఎస్ఐ సారంగాపూర్, మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల అభినందించారు…

Related posts

మూషిక జింకల పునరుత్పత్తిపై తెలంగాణకు ప్రశంసలు

Satyam NEWS

చంద్రబాబుకు జ్యూరిచ్ లో ఘన స్వాగతం

Satyam NEWS

సోషల్ మీడియా సైకో పట్టుపడటంతో కంగారు…

Satyam NEWS

Leave a Comment