కడప జిల్లా రాజంపేట ప్రాంతంలో కంటి ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసే అంశంపై రోటరీ క్లబ్ పరిశీలన జరుపుతున్నది. కర్ణాటకలోని దావణగెరిలో రోటరీ క్లబ్ అంతర్జాతీయ జిల్లా (3160)సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో రాజంపేటలో చేపట్టాల్సిన ఈ ఆరోగ్య అవసరాల గురించి పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ గవర్నర్ శర్మ, జిల్లా (3160) గవర్నర్ నయన్ పాటిల్ పాల్గొన్నారు.
వారితో బాటు రోటరీ క్లబ్ ఆఫ్ అన్నమయ్య అధ్యక్షుడు రాజంపేట మాజీ ఎమ్మెల్యే అకేపాటి అమర్ నాథ్ రెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ అన్నమయ్య క్లబ్ ప్రతినిధులు గురు ప్రతాప్ రెడ్డి, హరినాథ్ చౌదరి, మహేష్ రెడ్డి, గీతాల నరసింహా రెడ్డి, పసుపులేటి సుధాకర్, ఈనాడు శ్రీను, పోలి మురళి మోహన్ రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ పూర్తి స్థాయి నిర్ణయం తీసుకుంటే రాజంపేట ప్రాంతంలో కంటి ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.